Sunday, May 19, 2024
- Advertisement -

ఇక్కడ చేతకాలేదు.. అక్కడేమో!

- Advertisement -

ప్రధాని నరేంద్రమోడీ రూటే సెపరేటు అని ఆయన్ను దగ్గర్నుంచి గమనించిన వాళ్లు కొందరు చెబుతుంటారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఆయన అవలంబిస్తున్న వైఖరి కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. తన మనసులో మాట డైరెక్ట్ గా చెప్పరు.. ప్రజలకు అన్నీ చేస్తామని పబ్లిక్ గా హామీ ఇస్తుంటారు..

ఏం ఇస్తారో చూశాక మాట్లాడతానని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు టైమ్ గడిపేస్తుంటారు. ఇదంతా బాగా అలవాటైందో ఏమో.. మోడీ తన ఫార్ములాను ఆఖరికి ఫారిన్ టూర్లలో కూడా కంటిన్యూ చేసేస్తున్నారు.

దేశంలో కొన్నాళ్లుగా మత కలహాలు, దాడులు జరుగుతుంటే ప్రధాని మోడీ సైలెంట్ గా ఉన్నారు. ఎందుకూ ఏంటీ ఏం చేస్తున్నారని అని విపక్షాలు ఎంత ప్రశ్నించినా.. ఆయన నుంచి మాట మాత్రం కూడా సమాధానం రాలేదు. ఇప్పుడు మందీమార్బలంతో యూకే ట్రిప్ కు వెళ్లిన మోడీ.. ఇండియాలో అసహనం గురించి అక్కడ మాట్లాడారు. ఇప్పటికే గతంలో ఓ సారి కాంగ్రెస్ ను విదేశాల్లో విమర్శించి విపక్షాల ఆగ్రహానికి గురైన మోడీ.. ఇప్పుడు మళ్లీ తనకు తానే టార్గెట్ గా మారుతున్నారు. ఇండియాలో అసహనాన్ని సహించే ప్రశ్నే లేదంటూ.. బ్రిటన్ లో కామెంట్ చేసి.. విమర్శకుల నోళ్లకు మళ్లీ కాస్త పని కల్పించారు.

ఇప్పటికే బీహార్ ఎన్నికల్లో ఓటమితో.. ఇంటా బయటా కార్నర్ అవుతున్న మోడీ అండ్ కో.. ఈ తీరుతో మరిన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తోంది. గుజరాత్ రాజకీయాలనే దేశమంతా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తే ఇలాగే జరుగుతుందని బీజేపీలోనూ ఇంటర్నల్ గా కామెంట్లు వినిపిస్తున్నాయి. వివాదాలను ఎంకరేజ్ చేయకుండా.. పార్టీ నేతలను అదుపులో పెడితే మంచిదన్న సూచనలు కూడా కొందరు నేతలు చేస్తున్నారు. వాజ్ పేయి అంతటి మహానుభావుడే ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికారాన్ని దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు మోడీ తీరు మారకుంటే.. మళ్లీ అదే రిపీట్ కాదన్న గ్యారెంటీ ఏదీ లేదని రాజకీయ విశ్లేషకులు కూడా బీజేపీని అలర్ట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -