Sunday, May 5, 2024
- Advertisement -

వేణుమాధవ్ మూవీస్ చేయకపోవడం కారణం ఆరోగ్య సమస్యలే!

- Advertisement -

టాలీవుడ్ లో ఉన్న స్టార్ కమెడియన్స్ లో వేణు మాధవ్ ఒక్కడు అని చెప్పోచ్చు. తెలుగు ఇండస్ట్రీ లో బ్రమి.ఎమ్ ఎస్ నారాయణ, అలీ, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, సునీల్ వీళ్ళ లాగే ఇండస్ట్రీ లో బాగా పేరు సంపాదించిన వ్యక్తి వేణు మాధవ్. కాని ఈ మధ్య కాలం లో వేణు మాధవ్ అసలు మూవీస్ లో కనిపించడమే మానేసాడు . తెలుగు ప్రేక్షకులకి అసలు వేణు మాధవ్ కి ఏమయింది అని కూడా అర్ధం కావడం లేదు.

తన కెరీర్ ని ఒక మిమిక్రీ ప్రోగ్రామ్స్ తో స్టార్ట్ చేసి చాల ఫేమస్ అయ్యాడు. ఒక ప్రోగ్రాం లో సీనియర్ ఎన్టీఆర్ ముందు వేణుమాధవ్ ఇచ్చిన మిమిక్రీ తో ఇంప్రెస్స్ అయ్యిన ఎన్టీఆర్ బ్రదర్ మీరు మూవీస్ లో ట్రై చేయండి ఫ్యూచర్ లో మంచి కమెడియన్ అవుతారు అని అనడం తో సీరియస్ గా మూవీస్ లో చాన్సులకోసం తీరగడం మొదలెట్టాడు. అలా 1996 డైరెక్టర్ ఎస్. వి కృష్ణ రెడ్డి డైరెక్ట్ చేసిన సంప్రదాయం మూవీ ద్వారా తెలుగు తెరకి పరిచయం అయ్యాడు వేణు మాధవ్ , ఆ తరువాత 1997 లో చిరంజీవి నటించిన మాస్టర్ మూవీ లోను ఒక పాత్ర పోషించాడు.ఆ తరువాత వచ్చిన పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ పాత్ర చేసి అందరిని మెప్పించి మంచి కమెడియన్ గా రాజ్యం వేలాడు. 

కాని రీసెంట్ గా వేణుమాధవ్ మూవీస్ లో కనిపించక పోవడానికి కారణం అతని ఆరోగ్య సమస్యలే.వేణు మాధవ్ కి ఫిట్స్ జబ్బు ఉందని చాల మందికి తెలియదు.రామ్ చరణ్ రచ్చ మూవీ లో నటిస్తున్న టైం వేణుమాధవ్ కి ఫిట్స్ వచ్చి చాల భయపెట్టింది. ఈ ఫిట్స్ ప్రోబ్ల్రెమ్స్ తోనే అయన మూవీస్ లో నటించడం లేదా? లేక ఏదైన ప్రాబ్లమ్ ఉందా తెలియాదు కానీ త్వరలోనే వేణుమాధవ్ కోలుకొని మూవీస్ లోకి వచ్చి మళ్ళీ మనలందరిని మళ్ళి నవ్వించాలి అని కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -