Tuesday, May 21, 2024
- Advertisement -

అమెరికన్ల ముందు మనదేశ పరువు తీస్తున్నారు!

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరైనోడు’. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగువారు ఎక్కువగా నివసించే అమెరికా లాంటి దేశాల్లోనూ విడుదలైంది. తాజాగా అమెరికాలో ఈ చిత్ర ప్రదర్శనలో మన దేశం పరువు పోయే పరిస్థితి చోటు చేసుకుంది. అమెరికాలోని కన్సాస్‌లో లోకల్ యూనివర్శిటీకి చెందిన ముగ్గురు తెలుగు స్టూడెంట్స్ టికెట్ లేకుండా ‘సరైనోడు’ సినిమా చూస్తు థియేటర్ యాజమాన్యానికి దొరికి పోయారు.

ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి థియేటర్ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ…లోకల్ ఎగ్జిబిటర్ కల్పించుకోవడంతో ఎలాంటి ఫిర్యాదు చేయకుండా వదిలేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి సంఘటనలు అమెరికాలో ఇటీవల కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. అక్రమంగా సినిమా చూస్తూ అమెరికన్ల ముందు మనదేశ పరువు తీస్తున్నారు అక్కడికి చదువుకోవడానికి వెళ్లిన పలువురు స్టూడెంట్స్. అమెరికాలో ఇండియన్స్‌కి మంచి పేరుంది.

అయితే ఇలాంటి వారి వల్ల పేరు చెడిపోతుంది. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన తమిళంలో హీరోగా మంచి గుర్తింపు ఉన్న ఆది పినిశెట్టి తొలిసారి తెలుగులో విలన్ గా కనిపించాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిసాలు ఈ సినిమాలో హీరోయిన్లుగా మెరిశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -