Saturday, May 4, 2024
- Advertisement -

చిరు ఇంటికి రాజశేఖర్ వెళ్తే.. ఆయన ఏమన్నారో తెలుసా..?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవికి, సీనియర్ హీరో రాజశేఖర్‌కు మధ్య ఒక టైంలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయనే విషయం అందరికి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన మూవీ ‘రమణ’ను తాను రీమేక్ చేయాలని భావిస్తే.. దాన్ని చిరంజీవి లాగేసుకున్నారంటూ రాజశేఖర్ అప్పట్లో అసహనం వ్యక్తం చేయడం అందరికి గుర్తుండే ఉంటుంది.

మరో సందర్భంగా మెగాస్టార్ మీద విమర్శలు చేసినందుకు.. మెగా ఫ్యాన్స్ రాజశేఖర్ మీద దాడికి ప్రయత్నించడం.. చిరు స్వయంగా వాళ్లింటికెళ్లి సారీ చెప్పడం అందరికి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌తో కూడా రాజశేఖర్, జీవితలకు కొంత అంతరం ఉంది. గబ్బర్ సింగ్ మూవీలో రాజశేఖర్ మీద పవన్ కళ్యాణ్ పంచులేయడం ఈ అంతరానికి సూచికే. ఈ క్రమంలో తాజాగా రాజశేఖర్.. చిరంజీవి ఇంటికి వెళ్లానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన న్యూ మూవీ గరుడవేగ చూడమంటూ చిరును రాజశేఖర్ అడిగినట్లు తెలుస్తోంది. ” అవును.. నేను మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళాను.. నా కొత్త సినిమాని చూడమని ఆహ్వానించాను.. అందుకు ఆయన గరుడ వేగ ట్రైలర్ చూశాను చాలా బాగుంది..

ఇప్పుడు అందరు ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారని చిరంజీవి గారు మెచ్చుకున్నారు అని రాజశేఖర్ తెలిపారు. మెగా ఫ్యాన్స్ లో తన పై వ్యతిరేకత తగ్గించుకోవడానికి.. వాళ్లను కూడా తన సినిమా వైపు మళ్లించడానికి రాజశేఖర్ ఈ మాట అన్నట్లుంది. మరి నిజంగానే చిరంజీవి గరుడ వేగ చూస్తా్రో లేదో వేచి చూడాలి. చిరు మూవీ చూస్తే.. గరుడవేగ కి ఇది బాగా ప్లస్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -