Thursday, May 16, 2024
- Advertisement -

రియ‌ల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్‌… రేవంత్‌పై వ‌ర్మ పొగ‌డ్త‌లు..

- Advertisement -

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్ఠి ఇప్పుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై పడింది. వ‌ర్మ‌కు రేవంత్‌రెడ్డికి ఉన్న సంబంధం ఏమోగాని కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ప్ప‌టినుంచి ఆయ‌న‌మీద పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు వివిదాల వ‌ర్మ‌. అయితె ఇప్పుడు తాజాగా రేవంత్‌రై త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన పోస్ట‌ర్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ పై వర్మ రెండు పోస్టర్లను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. వీటికి ‘రియల్ మెగాస్టార్ ఆఫ్ కాంగ్రెస్’ అనే టైటిల్ పెట్టాడు. అంతేకాదు, ‘బాస్ ఈజ్ హియర్’ అంటూ ట్యాగ్ లైన్ కూడా జత చేశాడు. ఈ పోస్టర్ల కోసం చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’కు చెందిన పోస్టర్లను మార్ఫింగ్ చేసి… చిరంజీవి తలకు బదులుగా రేవంత్ తలను ఉంచాడు. భ‌విష్య‌త్తులో ఇంకెన్ని రేవంత్‌పై ఇలాంటి సంచ‌ల‌నాల పోస్ట్‌లు పెడ‌తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -