Tuesday, May 21, 2024
- Advertisement -

అసలు కంటే కొసరే హైలైట్ అయ్యింది!

- Advertisement -

టాలీవుడ్ లో ఏ ఇద్దరిని పలకరించినా కొన్ని రోజులుగా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు. దగ్గుబాటి భల్లాలదేవుడు రానా, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్.. అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది.

బావ సుధీర్ బాబు కొత్త సినిమా భలే మంచి రోజు ఆడియో రిలీజ్ కు మహేష్ తో పాటు.. రానా కూడా గెస్ట్ గా వచ్చాడు. బావ సినిమా కావడంతో.. మహేష్ కాస్త ముందే అటెండయ్యాడు. తర్వాత కూల్ గా వచ్చిన రానా.. ఎంట్రీతోనే అందరినీ ఆశ్చర్యపరిచాడు. వచ్చీ రాగానే.. మహేష్ బాబు కాళ్లు మొక్కేందుకు ట్రై చేసి.. సర్ ప్రైజ్ షాక్ ఇచ్చాడు.

రానాను కాస్త స్లో గా అర్థం చేసుకున్న మహేష్.. అలా వద్దంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చివరికి మామూలుగానే పక్కపక్కను కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు.

ఇదంతా చూసిన టాలీవుడ్ జనాలు.. సుధీర్ బాబు ఆడియో ఫంక్షన్ కంటే.. ఈ ఇద్దరి మధ్య ఇన్సిడెంటే హైలైట్ అయ్యిందని కామెంట్ చేస్తున్నారు. ఈ మధ్య మల్టీ స్టార్ సినిమాలతో హల్ చల్ చేస్తున్న రానా.. చూడబోతే త్వరలోనే మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -