Tuesday, May 21, 2024
- Advertisement -

తనకొద్దట.. కానీ తనవాళ్లకు కావాలట

- Advertisement -

బాహుబలి గ్రాండ్ సక్సెస్ అయినప్పటి నుంచి.. దర్శక ధీరుడు రాజమౌళి ఏం మాట్లాడినా అంతా కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ఆ మాటల వెనక ఏదో మతలబు ఉండే ఉంటుందని అంచనా వేస్తున్నారు. తన స్నేహితుడి కూతురి పెళ్లికి హాజరయ్యేందుకు కేరళ వెళ్లిన రాజమౌళి.. అవార్డుల విషయంపై విలేకరుల ప్రశ్నలకు ఇచ్చిన రియాక్షన్లు కూడా.. ఇలాగే కొత్త చర్చకు కారణమయ్యాయి.

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కు బాహుబలి తెలుగు వర్షన్ నామినేట్ అయిందటగా.. మీ రియాక్షన్ ఏంటి అని కేరళ విలేకరులు అడిగిన ప్రశ్నకు.. రాజమౌళి కాస్త డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు. తనకు అవార్డుల మీద నమ్మకం లేదని.. వాటికి విలువే లేదన్నది తన అభిప్రాయమనీ  రిప్లై ఇచ్చారు.

కానీ.. తనతో పని చేసిన టెక్నీషియన్లు, నటీనటులకు అవార్డులు వస్తే మాత్రం ఆనందంగా ఉంటుందని రాజమౌళి అన్నారు. అది.. వారిలో ఉత్సాహం పెంచుతుందని తాను అనుకుంటున్నట్టు చెప్పారు.

అయితే.. 88వ ఆస్కార్ అవార్డుల కేటగిరీకి మన దేశం తరఫున నామినేషన్ కు పోటీ పడిన సినిమాల్లో ఒకటి బాహుబలి. చివరికి.. మరాఠీ సినిమా కోర్ట్.. ఇండియన్ నామినేషన్ గా ఫైనల్ అయ్యింది. ఇది.. రాజమౌళికి కాస్త ఆవేదన కలిగించినట్టు తెలుస్తోంది. అవార్డులు తనకు వద్దనడం… తన వాళ్లకు మాత్రం కావాలనడం వెనక అసలు ఉద్దేశం ఇదే అయి ఉండొచ్చన్నది జక్కన్న ఉద్దేశంగా వినిపిస్తోంది. నిజమేనంటారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -