అరేబియా గుర్రం లాంటి రెజీనా… సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా షూట్ లో కన్నీరు పెట్టుకుందట. ఎవరో ఏదో అన్నట్లు,ఇంకా ఏదో చేసినట్లుగా న్యూ జెర్సీలోని ఓ నది ఒడ్డున కూర్చుని మరీ ఏడ్చేసిందట.
యూనిట్ కూడా రెజీనా పడుతోన్న బాధను ఓదార్చే ప్రయత్నం చేసింది గాని…. పరిష్కరించే యత్నమైతే చేయలేదని తెలుస్తోంది. ఇంతకీ రెజీనాకు అంతలా కన్నీరు రావడానికి కారణమైన సంగతిని లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. న్యూ జెర్సీలోని పూర్తి చలి వాతావరణంలో హీరో ఫుల్ స్వెట్టర్ వేసుకుని లవ్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తుంటే… రెజీనా హాట్ గా కనిపించడం కోసం పొదుపైన దుస్తులు వేసుకుని ఓ సీన్ లో రొమాంటిక్ గా అంతటి చలిలో నటించలేకపోవడం. దీంతో దర్శకుడు చాలా టేక్ లు తీసుకోవల్సి వచ్చింది. తనకు యాక్టింగ్ రాకే ఇన్ని టేక్ లు తీసుకుంటున్నారని భావించిన రెజీనా… ఆ స్పాట్ లో బోరుమని ఏడ్వడం మొదలు పెట్టింది.
యూనిట్ ఎంత వారించినప్పటికీ..వినకుండా విలపించినట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ రెజీనా ఏడ్చినదాంట్లో కూడా అర్ధముందనేది కొందరి వాదన. లేకపోతే ఏముందని, ఏం చేస్తుందని చెప్పి రకుల్ కు అన్ని చిత్రాలు
వస్తున్నాయి, ఏం లేదని రెజీనాకు రాకుండా పోతున్నాయి. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే కదా. మొత్తానికి రెజీనా ఇంతలా ఏడ్వడానికి కారణం యూనిట్ సభ్యులైతే కాదు గాని తనకు రావల్సిన ఆఫర్లను కూడా కొట్టుకు పోతున్న రకుల్ ప్రీత్ సింగే కారణంగా కనిపిస్తుంది.