Wednesday, May 15, 2024
- Advertisement -

‘ఎవరు’ కోసం ఆ అగ్రిమెంట్ పని చేయలేదా?

- Advertisement -

మొన్నామధ్య తెలుగు సినిమా పరిశ్రమ లో నిర్మాతలు అందరూ కలిసి డిజిటల్ ప్లేట్ ఫారంస్ మీద సినిమాలు త్వరగా విడుదల అవుతున్నందున, అలా జరగకూడదు అని చెప్పి అందరూ కలిసి ఏకాభిప్రాయం తో ఏకాభిప్రాయం తో సినిమా విడుదల అయినా 50 రోజుల వరకు సినిమా స్ట్రీమ్ కాకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆ పిమ్మట విడుదల అయినా సినిమాలు అన్నీ యాభై రోజుల తర్వాత నే వచ్చాయి. మహర్షి వంటి పెద్ద సినిమాలకి కూడా ఈ రూల్ వర్తించింది. అయితే అనూహ్యం గా ఎవరు సినిమా విషయం లో ఈ అగ్రిమెంట్ వర్తించినట్టు లేదు.

ఇంకా యాభై రోజులు పూర్తి కాక మునుపే ఈ సినిమా ఆన్లైన్ లో ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది దీని బట్టి చూస్తే ఈ నిబంధన అన్ని సినిమాలకి తప్పకుండా ఉంచాలి అనే ఉదేశ్యం లేదు అని అనిపిస్తుంది. అంతే కాకుండా ఈ నిబంధన ని నచ్చిన వాళ్ళు పాటిస్తూ నచ్చని వాళ్ళు పాటించకుండా ఉండేలాగా కూడా జరుగుతుంది అని అర్ధం అవుతుంది.

ఎవరు అనేది చిన్న సినిమా కాబట్టి కచ్చితంగా త్వరగా ఆన్లైన్ లో విడుదల చేస్తే డిజిటల్ రైట్స్ కూడా ఎక్కువ వస్తాయి కనుక ఈ రూల్ పెట్టుకుంటే కోల్పోయేదే ఎక్కువ ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -