Wednesday, May 15, 2024
- Advertisement -

అడివి శేష్ క్రెడిట్ కొట్టేస్తాడా?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమల్లో ఉన్న చాలా మంది యువ హీరోల్లో అడివి శేష్ కూడా ఒకడు. శేష్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు కానీ తనకి సక్సెస్ మాత్రం కేవలం ఇటీవలే వచ్చింది. పంజా, బాహుబలి సినిమాల్లో కనిపించి కాస్త క్రేజ్ తెచ్చుకున్న శేష్, ఆ తర్వాత మెల్లగా, క్షణం సినిమా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా తో విజయం సాధించిన శేష్ గూఢచారి అనే ఇంకో సినిమా తో ఇంకొంచెం పెద్ద స్థాయి కి ఎదిగాడు. మార్కెట్ పరం గా ఇప్పుడు శేష్ కి తిరుగు లేదు. తన నెక్స్ట్ సినిమా ని మహేష్ బాబు స్వయం గా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా శేష్ కూడా కష్టపడి ప్రతి సినిమాని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు.

అయితే ఈ తరుణం లో శేష్ మీద ఒక కంప్లైంట్ ఉంది. శేష్ ఏ సినిమా కి పని చేసినా కానీ ఆ సినిమా తాలూకు క్రెడిట్ మొత్తం తన ఖాతా లో కి వేసుకుంటాడు అని, ఎట్టి పరిస్థితుల్లో కూడా శేష్ ఇంకొకడికి ఆ క్రెడిట్ పోనివ్వడని కంప్లైంట్ ఉంది కానీ అందులో ఎంత మాత్రము నిజం లేదనేది శేష్ వాదన.

ఎవరు అనే సినిమా ప్రమోషన్స్ విషయం లో బిజీ గా గడుపుతున్న శేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ, అది అందరూ అనుకుంటారు కానీ నిజానికి తను ఆలా చేసే మనిషి కాదని, తన తో పని చేసిన వాళ్ళకి క్రెడిట్ వచ్చింది, విజయం కూడా సాధించారని శేష్ చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -