Tuesday, May 21, 2024
- Advertisement -

ఇంతకి రాజమౌళి నాన్నకు ప్రేమతో చూసాడా లేదా?

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి గత కొంత కాలంగా తెలుగు సినిమాల గురించి ఎలాంటి ట్వీట్ చేయడం లేదు. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో సినిమా గురించి ఇంత వరకు జక్కన్న ఎలాంటి ట్వీట్ చేయలేదు. సినిమా రిలీజ్ అయ్యి వారం అవుతున్న ఎన్టీఆర్ సినిమాపై ఇంక స్పందించలేదు రాజమౌళి.

సుకుమార్ డైరేక్షన్ అంటే జక్కన్నకు చాలా ఇష్టం పలు సందర్భలో ఈ విషయం జక్కనే చెప్పిండు. అలానే ఎన్టీఆర్ తనకు ఇష్టమైన హీరో అని ఇంతకు ముందే రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. ఇంత ముఖ్యమైన వ్యక్తుల నుంచి వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమాపై ఎలాంటి ట్వీట్ చేయకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నాన్నకు ప్రేమతో ట్రైలర్ వచ్చినప్పుడు రాజమౌళి చాలా బాగా ఉందని తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలిపాడు. మళ్ళీ ఇంతవరకు ఈ సినిమా పై ఎలాంటి ట్వీట్ చేయలేదు.

అసలు రాజమౌళి నాన్నకు ప్రేమతో సినిమా చూడలేదుమో అందుకే ట్వీట్ చేయలేదు అనే గుస గుసలు సినీ పరిశ్రమలో వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడైన తన అభిమాన నటుడు సినిమా గురించి స్పందిస్తాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -