Monday, May 6, 2024
- Advertisement -

‘ఎరుపు’ అదేమీ బూతు టైటిల్ ?

- Advertisement -

ఈ మధ్య కాలం లో అర్ధం పర్ధం లేని టైటిల్స్ చాలానే వింటున్నాం, అలాంటి పేర్లు పెట్టడం లో టాలీవుడ్ కి టాలీవుడ్డు మాత్రమే సాటి అని చెప్పాలి. దిల్ రాజు ప్రేమలో పడ్డాడు.. ఇదేగా ఆశపడ్డావ్ బాలా కృష్ణా.. ప్రభాస్ పెళ్లి.. ఇలాంటి వింత టైటిల్స్ కి మనవాళ్ళు బాగా అలవాటు పడ్డారు.

ఇప్పుడు అదే టైపు లో కాస్త అటూ ఇటూ గా ‘ ఎరుపు ‘ అనే టైటిల్ మాత్రం కాస్త ఆసక్తిగా మారింది. ఇదివరకు ఓయ్ అనే సినిమా తీసి ప్లాప్ చవిచూసిన ఆనంద్ రంగా, తరవాత కాలం లో ప్రొడ్యూసర్ గా మారాడు. ఇప్పుడు మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుని ఎరుపు అనే సినిమాతో సిద్దం అయ్యాడు.

నిజానికి ఎరుపు అంటే రెడ్ కలర్ అనే మీనింగే వస్తుంది. కాని మనం సినిమాల్లో ఎన్నిసార్లు ..ఎరుపు.. అంటూ ఒక బూతు మాటకు ప్రతీకగా సబస్టిట్యూట్ చేశారో మనకు తెలుసు. సో ఆ టైటిల్ ని వినగానే కాస్త వింతగా అనిపిస్తుంది. ఈ సినిమా తాలూకా టీజర్ ని జనవరి ఇరవై ఒకటిన క్రికెటర్ వీవీ ఎస్ లక్ష్మణ్ మరియూ హీరో సిద్దార్థ్ ల చేతుల మీదగా లాంచ్ చేస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -