బ్రూస్ లీ తో మళ్లీ కలిసారు కదా అనుకున్న ఆనందం శ్రీనువైట్ల,కోన వెంకట్ కు ఎక్కువ సేపు నిలవలేదు.సినిమా ఇచ్చిన రిజల్ట్ తో వీరి కాంబినేషన్ పై లేనిపోని మాటలు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి.
బ్రూస్ లీ సినిమా కొందరకి కలిసొచ్చినా…టీం మెంబర్స్ కు మాత్రం ఏమాత్రం కలిసిరాలేదనే చెప్పాలి. ఈసినిమా ఇచ్చిన రిజల్ట్ అందరి టెక్నీషియన్స్ పైనా పడిపోయింది.మరీ ముఖ్యంగా డైరెక్టర్ శ్రీనువైట్ల,రైటర్ కోన వెంకట్ అండ్ టీం మీద అయితే మరీను.ఈ సినిమా రిజల్ట్ తో వీరు తమ కాంబో గురించి మళ్లీ ఆలోచించడం మొదలు పెట్టారు.తమ కాంబోలో వచ్చిన ప్రతి చిత్రం హిట్ అయిపోతుందని చెప్పడానికి వీల్లేదని ట్రేడ్ కు అర్ధం అయ్యేలా చేశారు.
బ్రూస్ లీ చిత్రం విషయంలో కోన వెంకట్ టీంను కొందరు కావాలని టార్గెట్ చేస్తున్నారంటున్నారు.అలాగే ఇంకొందరు శ్రీనువైట్లను టార్గెట్ చేస్తున్నారు.స్క్రిప్ట్ విషయంలో ఎడ మొహం పెడ మొహంగా శ్రీను వైట్ల,కోన వెంకట్ లు ఉండడమే బ్రూస్ లీ ఇలా అయిందనే వారు లేకపోలేదు. దీంతో ఈ చిత్రం తర్వాత నాలుగు రోజుల క్రితం కోన వెంకట్ చెప్పినట్లు… ఖచ్చితంగా తన సొంత కుంపటిలోనే సినిమాలు చేసుకుంటూ పోతాడని చెబుతున్నారు.
శంకరా భరణం తర్వాత కూడా కోన అదే రూట్లో వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తుంది. కోన వెంకట్ మళ్లీ సొంత కుంపటి పెట్టుకుని బండి లాగించేస్తే…శ్రీనువైట్ల కూడా తనకు కెరియర్ ఇచ్చిన రవితేజ చిత్రాలతోనే మళ్లీ ఫామ్ లోకి వద్దామని చూస్తున్నాడట.ఇందుకోసం తాను కూడా హరీష్ శంకర్ మాదిరిగా రవితేజపైనే ఆశలు పెట్టుకున్నాడు. వన్స్ రవితేజను అడ్డం పెట్టుకుని ఓ హిట్ పీకి….ఆతరువాత ఎప్పటిలాగే మళ్లీ తన హై లైన్లో వెళ్లిపోదామనే ఆలోచనలును శ్రీను వైట్ల చేస్తున్నాడు.దీనికోసమని శ్రీనువైట్ల ,కోన వెంకట్ లు ఒకరిని ఒకరు చూసుకోకుండా… ఇద్దరు చెరో దారి వెతుక్కుంటున్నారు.