Monday, April 29, 2024
- Advertisement -

ఆంధ్ర మంత్రికి తెలంగాణ మంత్రికి తేడా అదే !

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ శాఖ మంత్రులపై ట్విట్టర్ పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా కే‌టి‌ఆర్ ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణనూ ఐటీ రంగంలో ముందుకు నడిపించడంలో కే‌టి‌ఆర్ కృష్టి చాలానే ఉందనే చెప్పవచ్చు. ఎన్నో సరికొత్త నిర్ణయాలు తూసుకుంటూ రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించంలో కే‌టి‌ఆర్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఇక తాజాగా ప్రముఖ బ్యాటరీస్ కంపెనీ అయిన ” అమర్ రాజ బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ” ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తరలిపోయింది. .

ఈ కంపెనీ టిడిపి ఎంపీ గళ్ళ జయధేవ్ సంబంధించినది అని అందరికీ తెలిసిందే. కాగా బ్యాటరీస్ రంగంలో అమర రాజ బ్యాటరీస్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. దాంతో ఇలాంటి బడా కంపెనీ ఏపీ నుంచి వాకౌట్ చేసి తెలంగాణకు చేరడంతో.. ఏపీ ఐటీ రంగంపై సెటర్ల వర్షం కురూపిస్తున్నారు నెటిజన్స్. వైఎస్ జగన్ హయంలో ఇలా బడా కంపెనీలు రాష్ట్రం వదిలిపోవడం సిగ్గు చేస్తూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు కేవలం రికార్డింగ్ డ్యాన్సులు చేయడం టాప్పా రాష్ట్రనికి పెట్టుబడులు ఆకర్షించడం తెలియదనే సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్స్.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే‌టి‌ఆర్‌ ను చూసి నేర్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. వైసిపి కు చెందిన వారు కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో సి‌ఎం కూతురు కవిత కు నోటీసులు.. ఎలా స్కామ్ లు చేయాలో నేర్చుకోవాలా అంటూ వైసిపి వర్గానికి చెందిన వారు కామెంట్లు పెడుతున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి అమర్ రాజా కంపెనీకి భారీగా ముడుపులు అందాయని అందుకే ఆ కంపెనీ తెలంగాణకు తరలి పోయిందని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తానికి తెలంగాణకు తరలి వెళ్ళిన అమర రాజ బ్యాటరీస్ గ్రూప్ .. రెండు రాష్ట్రాల మద్య ట్విట్టర్ వార్ కు తెరతీసింది.

ఇవి కూడా చదవండి

సీమగర్జన.. మరో విశాఖగర్జన అవుతుందా ?

చంద్రబాబు స్టైల్ మార్చింది ఆయనే!

రేవంత్, జగ్గారెడ్డి మద్య తోడి కోడళ్ళ పంచాయతీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -