Thursday, May 9, 2024
- Advertisement -

నితిన్ ని మోసం చేస్తున్న త్రివిక్రమ్ !

- Advertisement -

స్టార్‌ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్న త్రివిక్రమ్‌ ఏరి కోరి నితిన్‌తో సినిమా చేస్తుండేసరికి అసలు మాటల మాంత్రికుడు ఆంతర్యం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు.

మూడే నెలల్లో షూటింగ్‌ పూర్తి చేసేసి సంక్రాంతికి రిలీజ్‌ చేసేస్తానని కూడా చెబుతున్న త్రివిక్రమ్‌ అసలేం చేస్తున్నాడు? నితిన్‌ని చిన్న పిల్లాడిని చేసి ఏదైనా ప్రయోగాన్ని అతనిపై చేస్తున్నాడా? లేదంటే మూడు నెలల్లో సినిమాని చుట్టి పారేయడం ఏంటి? 

నితిన్‌ మాత్రం ఇదేమీ ప్రయోగం కాదని, పక్కా త్రివిక్రమ్‌ మార్కు వినోదాత్మక చిత్రమని చెబుతున్నాడు. తనకి ఈ టైమ్‌లో త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమా రావడం అదృష్టమని అంటున్నాడు. ఈ చిత్రం విషయంలో నితిన్‌ ఎంత ఎక్సయిట్‌ అయ్యాడంటే దీనికి పారితోషికం పరంగా కూడా ఎలాంటి పట్టు పట్టలేదంట. ఎంతిస్తే అంతే ఇవ్వమని అన్నాడట. 

ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామ్యం కూడా తీసుకున్న త్రివిక్రమ్‌ దీనిని మెరుపు వేగంతో ఫినిష్‌ చేసి తన తదుపరి పెద్ద చిత్రానికి ప్లాన్‌ చేసుకుంటాడట. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -