Friday, May 3, 2024
- Advertisement -

సిగిరెట్ లు తేలేదు అని దారుణం !!

- Advertisement -

ర్యాగింగ్ విషయం లో ప్రభుత్వం ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా ఎన్ని చట్టాలు ఉన్నా దానిని ఆపడం ఎవరితరం కావడం లేదు.

 రిషితేశ్వరి కేసుతో సంచలనం రేగిన అదే గుంటూరు లో ఇప్పుడు పదవ తరగతి చదువుతున్న విద్యార్ధి పైన దాడి జరిగింది. వివరాలు చూస్తీ శ్యామలా నగర్ కి చెందినా అబ్దుల్ ముషారఫ్ బాలకుటీర్ లో  10వ తరగతి చదువుతున్నాడు దగ్గరలో నే బీటెక్ , ఇంటర్ విద్యార్ధులు ఉంటున్నారు. 

ఎనిమిదవ లైన్ లో కూర్చుని అటుగా వెళ్ళే 10 వ తరగతి పిల్లల్ని పిలిచి అల్లరి చేస్తూ ఉంటారు. ముషారఫ్ కూడా అదే రోడ్ లో ట్యూషన్ కి వెళుతూ ఉండగా వారు పిలిచి సిగిరెట్ లు తీసుకురమ్మని చెప్పారు.  

తనకు ట్యూషన్ సమయం అవుతున్నందున తేలేనని చెప్పి వెళ్లిపోగా, ఆగ్రహించిన సీనియర్లు ఉదయ్, శివ, వినయ్ అనే యువకులు, ముషారఫ్ ను ఇంటి నుంచి బయటకు పిలిచి దాడి చేశారు. ఈ దాడిలో ముషారఫ్ కంటికి గాయాలై లోపలి పోరలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

జరిగిన ఘటనపై అర్బన్ ఎస్పీ త్రిపాఠికి బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -