Saturday, April 20, 2024
- Advertisement -

రాహుల్, పునర్నవి కాంబోలో సినిమా.. మరో సంచలనం.!

- Advertisement -

బిగ్ బాస్ ద్వారా ప్రతి సీజన్ లో ఎవరో ఒకరు బాగా హైలైట్ అవుతారు. అయితే ఈ సారి మాత్రం రాహుల్ సింప్లిగంజ్.. పునర్నవి భూపాలం బాగా హైలైట్ అయ్యారు. ఈ సీజన్ లో రాహుల్ విన్నర్ గా నిలిచాడు. అయితే హౌస్ లో ఉన్నప్పుడూ రాహుల్, పునర్నవి క్లోజ్ గా ఉండేవారు. ఈ సీజన్ ముగిసిన తర్వాత నుంచి వీరిద్దరి మధ్య లవ్ ఉందని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ మొదలు అయిన తొలి ఎపిసోడ్లలో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. ఆ టైంలో పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని రాహుల్ అడిగాడు. అందుకు జవాబుగా నేను ఖాళీగా ఉన్నానా లేదా అన్నది తెలుసుకోవా అని పునర్నవి అన్నది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది.

దీంతో వీళ్లిద్దరూ హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు. బిగ్ బాస్ లో వీరీద్దరి మధ్య జరిగింది చూసి చాలా మంది వీరు ప్రేమించుకుంటున్నారు అనుకున్నారు. అందుకు తోడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్లిద్దరూ అదే పనిగా ఒకే దగ్గర కనిపించడంతో వీరి పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ వీళ్లిద్దరు మాత్రం మేము మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నారు. అయితే ఇటివలే ఓ ఇంటర్వ్యూలో పునర్నవితో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే 110 పర్సెంట్ సినిమా చేస్తానని రాహుల్ చెప్పాడు.

దాంతో తాము కలిసి నటించేందుకు సిద్దంగా ఉన్నామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. వీరిద్దరి క్రేజ్ చూసి టాలీవుడ్ లోని ఓ యంగ్ ప్రొడ్యూసర్ వీరితో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇందుకోసం షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన ఓ యంగ్ సెన్సేషన్‌తో కథ రాయించే పనిలో ఉన్నాడట. దీంతో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ అయింది. మరి వీరి కాంబోలే మంచి లవ్ సినిమా వస్తే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నెటిజన్లు కూడా అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -