జూ ఎన్టీఆర్ పై లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్..!

- Advertisement -

సీనీయర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఅర్ పై సంచలన కామెంట్స్ చేసింది. టీడీపీ భవితవ్యంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే విషయంపై నారా లోకేష్‌తో పోల్చుతూ జూనియర్ ఎన్టీఆర్‌పై లక్ష్మిపార్వతి కామెంట్స్ చేసింది. విషయంలోకి వెళ్తే.. ఇటివలే ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజం చూసింది.

దాంతో అందరి చూపి జూ ఎన్టీఆర్ పై పడింది. ఈ పరిస్థితుల్లో టీడీపీకి యువ నాయకుడి అవసరం ఉందని.. అది జూ ఎన్టీఆర్ తోనే సాధ్యం అవుతుందని చర్చలు నడిచాయి. ఇదే అంశంపై రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు కూడా స్పందించడంతో ఇది పెద్ద చర్చ అయ్యింది. ఇక టీడీపీలో ముఖ్యనేత అయిన వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పారు. అంతేకాకుండా చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడ్డాడు. ఎన్టీఆర్‌కు నారా లోకేష్ బయపడుతున్నారని, అందుకే.. ఆయన్ని పార్టీ దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు వంశీ.

- Advertisement -

ఎన్టీఆర్ చేతిలో పడితే తప్ప తెలుగుదేశం పార్టీ గాడిలో పడదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇదే అంశంపై ఓ కార్యక్రమంలో లక్ష్మీ పార్వతికి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నారా లోకేష్ కంటే ఎన్టీఆర్ చాలా బెటర్. ఎటు లేదన్న 100 రెట్లు బెటర్ పర్సన్ అనేసింది లక్ష్మిపార్వతి. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ప్రజలను మెప్పించగలిగే నటనా చాతుర్యంతో పాటు మంచి వాక్ చాతుర్యం కూడా ఉందని చెప్పింది లక్ష్మిపార్వతి.

లోకేష్ కంటే ఎన్టీఆర్ లో ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయని తెలిపింది. లోకేష్ ఏదీ లేదు కదా.. రాసిచ్చేది ఒకటి ఇతను చెప్పేది ఒకటి అని సంచలన కామెంట్స్ చేసింది లక్ష్మిపార్వతి. ఇక తనపై ఎన్నిరకలైన వార్తలు వచ్చిన ఎన్టీఆర్ స్పందించడం లేదు. తనపనేంటో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో RRR లో నటిస్తున్నాడు.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -