Friday, May 17, 2024
- Advertisement -

బాబును పాతాలానికి…జూనియ‌ర్‌ను పైకి లేపిన వ‌ర్మ‌..

- Advertisement -

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌తో టీడీపీకీ షాక్ ఇచ్చిన రామ్‌గోపాల్ వ‌ర్మ ఇప్పుడు మ‌రో సారి చంద్ర‌బాబుకు షాక్ ఇచ్చే విధంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు చేశానంటున్న వర్మ మాట‌ల దాడిని కొన‌సాగిస్తూనె ఉన్నారు. ఆంధ్రప్ర‌దేశ్‌లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుద‌ల కాకుండా బాబు అడ్డుకోవ‌డంతో ర‌గిలి పోతున్న వ‌ర్మ టీడీపీ శ్రేణుల‌కు మండే విధంగా ట్విట్ చేశారు.

ఈ సారి ట్వీట్‌లో బాబును పాతాలంలోకి ప‌డేసి…జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను పైకి లేపారు. ఎన్టీఆర్‌, జూనియర్‌ ఎన్టీఆర్ నిజమైన అభిమానులు ఎవరైనా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ సినిమా చూసిన తరువాతే చంద్రబాబుకు ఓటు వేయాలని కోరారు. నారా లోకేష్‌ టీడీపీకి నిజమైన వారసుడు కాదన్న వర్మ.. జూనియర్‌ ఎన్టీఆరే అసలైన వారసుడని పేర్కొన్నాడు. అంతేకాదు టీడీపీ పార్టీ భవిష్యత్తు కూడా జూనియరే అన్నాడు వర్మ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -