శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు తాజాగా లీక్ అయ్యాయి. అనుకున్నదానికంటే ముందుగానే శాంసంగ్ ఫ్లాగషిప్ ఫోన్లను లాంచ్ చేయనుందంటూ పలు అంచనాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌కు కొనసాగింపుగా రానున్న ఈ డివైస్ ఫీచర్లు, ఇతర వివరాలు లీక్ అయ్యాయి. 2018 జనవరి రెండవ వారంలోనే ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ 9, శాంసంగ్ 9+ పేరుతో తీసుకొస్తున్న ఈ డివైస్‌లను ఇంటర్నేషనల్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో లాంచ్ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గెలాక్సీ 9, శాంసంగ్ 9+ స్మార్ట్ ఫోన్‌లను జనవరిలోనే లాంచ్ చేసి.. మార్చినాటికి విక్రయాలను ప్రారంభించేందుకు యోచిస్తోంది.
6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నట్ స్టోరేజ్ కెపాసిటీ, కర్వ్‌డ్‌ఎడ్జ్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 845 క్వాల్కం , డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ప్రధాన ఫీచర్లుగా అంచనా వేస్తున్నారు. దాదాపు గెలాక్సీ ప్రీవియస్ మోడల్ తరహాలోనే బిగ్సిబీ బటన్ , ఫింగర్ పింట్ సెన్సర్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. మరోవైపు గెలాక్సీ ఎస్ 9లో 5.8అంగుళాల స్క్రీన్‌ను , గెలాక్సీ ఎస్9 ప్లస్‌లో 6.2-అంగుళాల స్క్రీన్ ను జత చేసినట్టు తెలుస్తోంది. ఇక కెమెరా విషయానికి వస్తే 16 ఎంపీ రియర్ కెమెరా, 12 ఎంపీ డ్యూయల్ సెల్ఫీ కెమెరాలను పొందుపర్చినట్టు అంచనా.