45 మందితో టీకాంగ్రెస్ సెకండ్ లీస్ట్..

తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజైంది. 45 మందితో రెండో జాబితాను ప్రకటించగా ఇప్పటివరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 19 స్థానాలు పెండింగ్‌లో ఉండగా రెండు రోజుల్లో ఆ జాబితా కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. రీసెంట్‌గా పార్టీలో చేరిన కోమటిరెడ్డితో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సెగ్మెంట్ నుంచి గద్దర్‌ కూతురు వెన్నెలకు టికెట్ ఇచ్చింది. ఇక ఈ జాబితాలో ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మలతో పాటు పొంగులేటికి ఛాన్స్ దక్కింది. అలాగే పరకాల టికెట్ ఆశీంచిన కొండా మురళితో పాటు ఇనుగాల వెంకట్రామిరెడ్డికి నిరాశే ఎదురైంది.

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ ఇదే..

సిర్పూర్‌ – రావి శ్రీనివాస్‌
అసిఫాబాద్‌ (ఎస్టీ) – అజ్మీరా శ్యామ్‌
ఖానాపూర్‌ (ఎస్టీ) – వెద్మర బొజ్జు
ఆదిలాబాద్‌- కంది శ్రీనివాస్‌ రెడ్డి
బోథ్‌ (ఎస్టీ) – వెన్నెల అశోక్‌
ముథోల్‌ – బోస్లె నారాయణరావు పాటిల్‌
ఎల్లారెడ్డి – కె.మదన్‌ మోహన్‌ రావు
నిజామాబాద్‌ రూరల్‌ – డాక్టర్‌ రేకులపల్లి భూపతి రెడ్డి
కోరుట్ల – జువ్వాది నర్సింగరావు
చొప్పదండి (ఎస్సీ) – మేడిపల్లి సత్యం
హుజురాబాద్‌ – వడితెల ప్రణవ్‌
హుస్నాబాద్‌ – పొన్నం ప్రభాకర్‌
సిద్ధిపేట: పూజల హరికృష్ణ
నర్సాపూర్‌ – ఆవుల రాజిరెడ్డి
దుబ్బాక – చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
కూకట్‌పల్లి – బండి రమేష్‌
ఇబ్రహీంపట్నం – మల్‌రెడ్డి రంగారెడ్డి
ఎల్బీనగర్‌ – మధు యాష్కి గౌడ్‌
మహేశ్వరం – కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
రాజేంద్రనగర్‌ – కస్తూరి నరేందర్‌
శేరిలింగంపల్లి – వి.జగదీశ్వర్‌ గౌడ్‌
తాండూర్‌ – బయ్యని మనోహర్‌రెడ్డి
అంబర్‌పేట్‌ – రోహిన్‌ రెడ్డి
ఖైరతాబాద్‌ – పి.విజయారెడ్డి
జూబ్లీహిల్స్‌ – మహ్మద్‌ అజహరుద్దీన్‌
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (ఎస్సీ) – డాక్టర్‌ జీవీ వెన్నెల
నారాయణపేట్‌ – డా. పర్ణిక చిట్టెం రెడ్డి
మహబూబ్‌నగర్‌ – యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి
జడ్చర్ల – జె. అనిరుధ్‌ రెడ్డి
దేవరకద్ర – గావినోళ్ల మధుసూధన్‌ రెడ్డి
మక్తల్‌- వాకిటి శ్రీహరి
వనపర్తి- డా. జిల్లెల చిన్నారెడ్డి
దేవరకొండ (ఎస్టీ)- నేనావత్‌ బాలూ నాయక్‌
మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి
భువనగిరి – కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి
జనగామ- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
పాలకుర్తి – యశశ్విని
మహబూబాబాద్‌ (ఎస్టీ)- డా. మురళీ నాయక్‌
పరకాల – రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్‌ పశ్చిమ – నాయిని రాజేందర్‌ రెడ్డి
వరంగల్‌ తూర్పు – కొండా సురేఖ
వర్ధన్నపేట (ఎస్సీ)- కేఆర్‌ నాగరాజు
పినపాక (ఎస్టీ)- పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మం – తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు – పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి