Saturday, May 18, 2024
- Advertisement -

నోట్ల రద్దు వెనక చాలా పెద్ద ప్లాన్ ఉంది..

- Advertisement -
A very huge plan behind currency demonetization

న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అంతా ఇబ్బంది పడుతున్నారు, కంగారు వాతావరణం ఏర్పడింది. అయితే ప్రధాని మోదీ మాత్రం చాలా ధైర్యంగా కనబడుతున్నారు. తన పొలిటికల్ కెరీర్‌ను సైతం పణంగా పెట్టి ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్నారు. సంచలనం సృష్టించిన ఈ నోట్ల రద్దు వెనకు చాలా పెద్ద కదే ఉంది

. ఇది కొద్దిరోజుల ముందు తీసుకున్న నిర్ణయం కాదు. చాలా కాలం నుంచి ప్లాన్ చేశారు. ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. దీనంతటి వెనక అసలు కారణం బ్లాక్ మనీ అరికట్టడం ఒక్కటే కాదు. పన్ను ఎగవేత దారులను కట్టడిచేయడం, ద్రవ్యోల్బణం తగ్గించడం, అన్ని రేట్లు తగ్గేలా చేయడం, ఉగ్రవాదం తగ్గడం, నకిలీ కరెన్సీని అరికట్టడం ఇలా ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ అప్పట్లోనే ఓ కీలకమైన సూచన చేశారు. పెద్ద నోట్లను ప్రతి పది సంవత్సరాలకొకసారి రద్దు చేయాలన్నారు. కానీ ఎప్పుడో 1978లో జనతా ప్రభుత్వం తర్వాత మళ్లీ ఇప్పుడు మోడీ చేశారు.  

ప్రజలను డబ్బులకు దూరం చేయడం, నోట్ల వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ మనీని వాడే విధంగా చేయాలనేది అసలు పథకం. లేదంటే నోట్ల రద్దు తర్వాత రూ. 500 పూర్తిగా అందుబాటులో ఉంచకుండా రూ. 2000 వేలు మాత్రమే ఎందుకు తీసుకొచ్చారు? జనం చిల్లర కోసం ఇంతలా ఇబ్బంది పడతారని ముందే ఊహించలేదా? అసలు కొన్ని రోజుల తర్వాత ఈ కొత్త రూ. 2000 నోటు కూడా రద్దు చేయాలనేది మరో ఆలోచన. దీనికి తోడు రూ. 1000 నోటు ఇక రాబోవని అరుణ్ జైట్లీ కూడా ప్రకటించడం ఇక్కడ విశేషం. వంద నోట్లను ఎక్కువ స్థాయిలో ముద్రించనున్నారట. అది కూడా పరిమిత స్థాయిలోనే. ఇలా రోజు రోజుకూ నోట్ల ముద్రణను తగ్గించి ప్రజలను ఎక్కువ శాతం కార్డులు ఉపయోగించేలా చేసి అన్ని సమస్యలను అరికట్టాలనేది అసలు ఆలోచన. నిజానికి డబ్బులు అందుబాటులో లేకపోవడంతో దాదాపు నగర ప్రజలంతా క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను వాడుతున్నారు. ఇదే, ఈ మార్పే నోట్ల రద్దు ద్వారా ప్రజల నుంచి కోరుకున్నది. అంటే మెల్లగా  ప్రజలను కరెన్సీ నుంచి దూరం చేసి కార్డుల వాడేలా చేయనున్నారన్నమాట. భవిష్యత్తులో ప్రధాని మోదీ లేదా కేంద్రం, ఆర్బీఐ నుంచి ఇంకా చాలా ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నోట్ల మార్పిడికి ఆఖరు తేదీలైన డిసెంబర్ 30, మార్చి 21 తర్వాత ఏం జరగనుందో చూడాలి. ఈ విషయాలన్నీ అంచనాలే అయినప్పటికీ వాస్తవం లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -