Monday, May 20, 2024
- Advertisement -

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ మూవీ రివ్యూ

- Advertisement -
ekkadiki pothavu chinnavada movie review

స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య వంటి వరస సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్లిన నిఖిల్.. ఈ మూడు వరస సినిమాల తర్వాత చేసిన శంకరాభరణం సినిమా ప్లాప్ అయ్యింది.

ఈ సినిమా ప్లాప్ ఆలోచనలో పడ్డ ఈ యంగ్ హీరో రొటీన్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి మరో సారి తనకు బాగా కలిసొచ్చిన ప్రయోగానికే ఓటు వేసి… రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ :

ఇంజనీరింగ్ స్టూడెంట్ అర్జున్(నిఖిల్ సిద్ధార్థ్).. తను లవ్ చేసిన అమ్మాయి అయేషాను పెళ్లి చేసుకోవడం కోసం రిజిస్టర్ ఆఫీస్ వస్తాడు. కానీ అక్కడికి మాత్రం అయేషా ఎంత సేపు ఎదురుచూసినా రాదు. దాంతో అయేషాను మోసం చేసిందని.. ఇక జీవితంలో ఎవరి కోసం ఎదురు చూడనని నిర్ణియించుకుంటాడు. అయేషాను మర్చిపోయి గ్రాఫిక్ డిజైనర్ గా సెటిల్ అవుతాడు. అదే టైంలో తన ఫ్రెండ్ అన్న కిశోర్( వెన్నెల కిశోర్) వింతగా ప్రవర్తిస్తుండటంతో అతడికి వైద్యం చేయించడానికి కేరళలోని మహిషాసుర మర్థని ఆలయానికి తీసుకెళతాడు. అక్కడకు తన అక్క వైద్యం కోసం వచ్చిన అమల అనే అమ్మాయి అర్జున్ కు పరిచయం అవుతోంది. ఇద్దరు బాగా దగ్గర అవుతారు. అయితే ప్రేమ విషయం చెపుదాం అనుకునేలోపు ఆమె అక్కడ నుంచి వెళ్లిపొతుంది. ఆమెను వెతుకుంటూ.. అర్జున్ విజయవాడ వెళ్తాడు. కానీ ఆమె ఏళ్ల కిందటే చనిపోయిందని తెలుసుకొని షాక్ అవుతాడు. అసలు నిఖిల్ ప్రేమించిన అయేషాకు ఏం అయ్యింది..? అసలు అమల ఎలా చనిపోయింది?  అర్జున్ వెంటే ఎందుకు అమల పడుతుంది? అన్నది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

ముందుగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా కథ గురించి. టైగర్ చిత్రంతో దర్శకుడు అయిన విఐ ఆనంద్ రెండో సినిమాతో మరోసారి అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ఫార్ములాగా మారిన కామెడీ హర్రర్ జానర్ నే నమ్ముకున్న ఎక్కడా రోటీన్ సినిమా అన్న ఫీలింగ్ కలగకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాను నడిపించాడు. దర్శకుడు ఈ సినిమాని నడిపించిన విధానం అదిరిపోయింది. స్క్రీన్ ప్లే కూడా అధ్బుతంగా ఉంది. ఇక అద్భుతమైన కథను ఎంచుకోవడంలో నిఖిల్ అక్కడే సగం సక్సెస్ అయ్యాడు. కాలేజ్ స్టూడెంట్ గా.. కెరీర్ లో సెటిల్ అయిన వ్యక్తిగా రెండు విభిన్న పాత్రలో నిఖిల్ చూపించిన వేరియేషన్ అద్భుతం అని చెప్పొచ్చు. ఈ సినిమాతో నిఖిల్ నటుడిగా మరో మెట్టు ఎదిగాడు. ఇక తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నందితా శ్వేత మంచి నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ప్రధానంగా హర్రర్ సీన్స్ లో నందితా కనబరిచిన నటన ఈ సినిమాకే హైలేట్. ఇక హేబా పటేల్ మరో సారి తన అందచందాలతో అల్లరి పిల్లగా అలరించింది. ఉన్నంతలో హేబా పర్వాలేదనిపించింది. ఇక మరో మేజర్ ప్లస్ పాయింట్ అవికాఘోర్ రోల్. స్క్రీన్ మీద కనిపించేది కొద్ది సేపు అయినా… తనదైనశైలిలో మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కామెడీ చాలా బాగుంది. ఈ సినిమాకు పెద్ద అసెట్ మ్యూజిక్. శేఖర్ చంద్ర అందించిన పాటలు, ముఖ్యంగా నేపథ్యసంగీతం బాగున్నాయి. ప్రతి సీన్‌ను బ్యాక్ స్కోర్ మరింత ఎలివేట్ చేసింది. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, ప్రవీణ్, తనికెళ్ల భరణి తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు. 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో అక్కడక్కడ  స్లో నేరేషన్ తో సినిమా నడుస్తోంది. మొదటి భాగంలో కొన్ని సీన్స్ ను ఎడిట్ చేస్తే ఇంకా బావుండేది. లవ్ సీన్స్ సినిమాలో పెంచి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది. 

మొత్తంగా: 

అద్భుతమైన కథ.. అద్భుతంగా నటించే నటీ నటులు.. ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. అక్కడక్కడా స్లో నేరేషన్ అనిపించినా.. సినిమా చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నిఖిల్ సినిమాల్లో కొత్తదనం ఉంటుందని వెళ్లిన ప్రతి ఒక్కరికి ఈ ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం ఖచ్చితంగా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -