Thursday, May 8, 2025
- Advertisement -

ప్రమాణస్వీకారానికి ఇమ్రాన్‌ఖాన్ న‌న్ను పిలువ‌లేదు…అమీర్‌ఖాన్‌

- Advertisement -

పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి తాను వెళ్లడం లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తెలిపారు. తాను పాకిస్థాన్ వెళ్తున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకార వేడుకకు సంబంధించి తనకు ఎటువంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పానీ ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని చెప్పిన ఆమిర్‌ ఖాన్‌.. ఆగస్టు 12న జరిగే ప్రజా కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపారు. మరోవైపు, ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి తాను వెళ్తున్నానని సిధ్దూ ఇప్పటికే ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -