Saturday, April 27, 2024
- Advertisement -

పాక్ – న్యూజిలాండ్ ఇంకా రేసులోనే!

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా తొలి రెండు సెమీస్ బెర్త్‌లు కన్ఫామ్ అయ్యాయి. భారత్ ఇప్పటికే తిరుగులేని విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లగా దక్షిణాఫ్రికా సైతం సెమీస్‌ బెర్త్‌ని కన్ఫామ్ చేసుకుంది. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,పాకిస్థాన్ పోటీ పడనున్నాయి. ఇక కీలక మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఓడిపోయింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఫఖార్ జమాన్…అత్యధిక సిక్సర్లు బాధిన ఆటగాడిగా నిలిచాడు.

ఫలితంగా సెమీఫైనల్‌ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ సత్తా చాటింది. వరల్డ్‌కప్‌లో నాలుగొందల పైచిలుకు పరుగులు చేసిన తర్వాత ఓటమి పాలైన తొలి టీమ్‌గా నిలిచింది న్యూజిలాండ్. పరాజయం పాలైన తొలి జట్టుగా న్యూజిలాండ్‌ నిలిచింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు ఖాతాలో వేసుకున్న పాకిస్థాన్‌ పట్టికలో ఐదో స్థానంలో నిలువగా.. వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకున్న న్యూజిలాండ్‌ నిలకడగా నాలుగో ప్లేస్‌లో ఉంది.

1992 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ దాదాపు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది. ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలో బరిలోకి దిగిన పాక్‌ లీగ్‌ దశలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగింట మాత్రమే నెగ్గింది. ఆ టోర్నీ కూడా రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలోనే జరగగా.. జింబాబ్వే, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్‌పై పాక్‌ నెగ్గింది. అనుకోకుండా సెమీస్‌లో న్యూజిలాండ్‌పై, ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలిచి తొలిసారి వరల్డ్ కప్‌ని ముద్దాడింది పాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -