- Advertisement -
యూనిఫాంతో రిటైర్ కావాలన్నది తన కల…అది నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా నియమించింది ప్రభుత్వం. దీంతో విజయవాడలోని ప్రింటింగ్ ప్రెస్ కు చేరుకున్న వెంకటేశ్వరరావు డీజీగా బాధ్యతలు స్వీకరించారు.
అయితే ఉద్యోగ బాధ్యతల్లో ఇవాళే ఆయనకు చివరి రోజు కావడంతో సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏబీ…రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీస్ లో ఛార్జ్ తీసుకున్నా అన్నారు. పోస్టింగ్ తీసుకున్నరోజు సాయంత్రమే పదవీ విరమణచేసే అవకాశం నాకు మాత్రమే వచ్చిందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపారు. తన సర్వీస్‌లో వెన్నంట ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటా అని చెప్పారు ఏబీ.