ఏపీలో వరుసగా హవాలా కుంభకోణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వైజాగ్‌లో హవాలా కుంభకోనం మరచిపోకముందే విజయవాడలో మరో హవాలా కుంభకోనం బయటపడిన సంగతి తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుంచి నిధులు తెప్పించుకొనేందుకు కొంత మంది వకార్పోరేట్ల వైద్యులు ప్రయత్నించినట్లు తెలిసిందే.విజయవాడలో రంగురాళ్లవ్యాపారి,హవాలా ఏజెంట్ అయిన బ్రహ్మాజి దిమ్మతిరిగే నిజాలు బయటకు చెప్పారు.
{loadmodule mod_custom,Side Ad 2}
ఈహవాలా కేసులో డాక్టర్లతోపాటు దమ్మున్న ఛానల్‌కు చెందిన రిపోర్టర్‌కు సంబంధం ఉందని చెప్పారు. తనకు హవాలా అంటే ఏమిటో తిలియదన్నారు బ్రహ్మాజి. డాక్టర్ పువ్వాడ రామకృష్ణ,సన్నీ,చల్లపాటి రవి వారితోపాటు వారికి మద్దతుగా వచ్చిన కొంతమంది రౌడీలు ఎత్తుకెల్లారని… వారం రోజులపాటు చిత్రహింసలు పెట్టి ఇంట్లో వదిలేశారన్నారు. తన వంటి మీద ఉన్న నగలతోపాటు …ఇంట్లో ఉన్న కొన్ని వజ్రాలను ఎత్తుకెల్లారని తెలిపారు.
{loadmodule mod_custom,Side Ad 1}
కిడ్నాప్ చేసిన వారిలో రవి తప్ప మిగితా ఎవరూ తనకు తెలియదన్నారు.ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సన్నీ అనే వ్యక్తి పిలిచాడని …అతని సమక్షంలోనే తనని కొట్టారని బ్రహ్మాజి ఆరోపించారు.అతడికి వైద్యులకు సంబంధం ఉండే ఉంటుందన్నారు. చిత్రహింసలు పెడుతున్న సమయంలో ఆ రిపోర్టర్ అక్కడే ఉండి ….బీరు తాగుతున్నారని వివరించారు.బెదిరించి నాతో చెప్పిస్తున్న విషయాలను అతను షూట్ చేస్తున్నారని…వారు చెప్పడంతోనే అతను ఆంధ్రజ్యోతి రిపోర్టరన్న సంగతి తెలిసిందన్నారు.వాల్లకు సంబంధించిన వ్యక్తి కాకుంటే నన్ను కొడుతున్నా చూస్తూ ఎందుకు కూర్చున్నారని బ్రహ్మాజి ప్రశ్నించారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Related