- Advertisement -

ఓ వైపు వరదలు..మరోవైపు రెడ్‌బుక్ రాజ్యాంగం!

- Advertisement -

విజయవాడ వరద బాధితులు ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదలతో ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోగా… వారం రోజుల నుంచి ఇల్లును శుభ్రం చేస్తూనే ఉన్నాం అని బాధితులు మండిపడుతున్నారు. తాము నష్టపోయిన వస్తువులకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాల్సిందే.. లేకపోతే మేము ఊరుకోం తిరగబడతాం అని హెచ్చరిస్తున్నారు. నాణ్యతలేని నిత్యావసర సరుకులు ఇస్తున్నారు అని దుయ్యబడుతున్నారు.

సీఎం చంద్రబాబు కనిపిస్తే నిలబెట్టి కడిగేస్తానని దుయ్యబడుతున్నారు. ఓ వైపు వరదలు మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం అండతో పల్నాడులో టీడీపీ గూండాలు రోజురోజుకీ పెచ్చుమీరుతున్నారు అని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు టార్గెట్‌గా దాడులు, దౌర్జన్యాలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబడుతున్నారు.

శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు కూడా టీడీపీ నేతలకు వంత పాడుతుండటంతో ప్రజల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. తాము అదుపులోకి తీసుకున్న వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్లు ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకి చెప్పడం లేదు పోలీసులు. దీంతో ఇది రాష్ట్రమా.. రావణకాష్టమా అని మండిపడుతున్నారు. చంద్రబాబు మూర్ఖత్వం కారణంగా 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని… అయినా మీకు సిగ్గురాలేదు. ఇంకా బురద రాజకీయాలు చేస్తూ బాధితులను వరదలోనే వదిలేశారు దుయ్యబడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -