హ‌రికృష్ణ‌మృతిపై చిరంజీవి భావోద్వేగం..

సినీనటుడు మాజీ ఎంపీ హరికృష్ణ హఠాన్మరణం కలిచివేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న మ‌ర‌ణం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని త‌న బాధ‌ను వ్య‌క్తం చేశారు. రామ్ చ‌ర‌ణ్‌తో క‌ల‌సి మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ భౌతికకాయానికి ఆయన నివాళులర్పించారు. నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు.

తన సోదర సమానుడు, ఎంతో ఆప్యాయంగా పలకరించే నందమూరి హరికృష్ణ అకాల మరణం చెందడంతో దిగ్భ్రాంతికి గురయ్యామని, చాలా బాధగా ఉందని, మనసు కలచివేస్తోందని అన్నారు. ఎప్పుడు కలిసినా ఎంతో ప్రేమా, ఆప్యాయతలతో పలకరించేవారు. కలిసిన కొద్దిసేపు ఎంతో సరదాగా మాట్లాడుతూ జోక్స్ వేస్తూ నవ్వించే హరిక్రిష్ణ గారు ఇలా మమ్మల్ని శోకంలో వదిలేసి వేళతారని ఊహించలేద‌న్నారు.