Sunday, May 5, 2024
- Advertisement -

పార్ల‌మెంట్‌లో ఎంపీగా అడుగుపెట్టిన మద్దాలి శివారెడ్డి అలియాస్‌ రవికిషన్‌..

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా ఐదేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘రేసుగుర్రం’లో విలన్ మద్దాలి శివారెడ్డి అంద‌రికి గుర్తుండే ఉంటుంది. సినిమాలో ఎమ్మెల్యే కావాల‌న్న ఆశ‌ల‌కు అల్లు అర్జున్ అడ్డు త‌గులుంటాడు. నామినేష‌న్ వేయ‌కుండానె ఎలాగోలా చివ‌ర‌కు మంత్రి అవుతాడు.శివారెడ్డి అనే నేను..’ అంటూ పదవీ ప్రమాణ స్వీకారం చేసి పొలిటికల్‌ పవర్‌ను ఎంజాయ్‌ చేయాలనే కోరికను తీర్చుకుంటాడు. అది సిన‌మా….సీన్ క‌ట్ చేస్తే ఇప్పుడు నిజంగానె ఎంపీగా పార్లమెంట్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వీడియోలు తెగ వైర‌ల్ అయ్యాయి.

భోజ్‌పురి స్టార్‌ రవికిషన్‌ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి 3లక్షల మెజారిటితో విజయం సాధించిన విషయం తెలిసిందే. రేసుగుర్రం సినిమాలో మంత్రిగా ప్రమాణం చేసిన మాటలను, లోక్‌సభలో ప్రమాణం చేసిన మాటలను పక్కపక్కన చేర్చిన వీడియో ఒకటి వైరల్‌ అయింది. ‘లోక్‌సభలో మద్దాలి శివారెడ్డి’ ‘ ఏయ్‌ నిజంగానే ఎంపీ అయ్యా’ అని రాసి ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ‘హేయ్‌ విలన్‌.. హీరో అయ్యాడు’, ‘సినిమాలో విలన్‌ అయినా..నిజజీవితంలో హీరోలా ప్రజలకు సేవ చేయాలి’,‘మద్దాలి శివారెడ్డి.. అనుకున్నది సాధించావ్‌ పో’ అంటూ రవికిషన్‌పై తెలుగు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -