Thursday, May 9, 2024
- Advertisement -

‘శివ’ నామ స్మరణ చేస్తున్న రాజమౌళి హీరోలు

- Advertisement -

రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తో తీరిక లేకుండా ఉన్నారు. ఎట్టి పరిస్థుల్లో ఈ సినిమా ని వచ్చే ఏడాది జులై కల్లా విడుదల చేయాలనే తలంపు తో చిత్ర యూనిట్ పని చేస్తుంది. ప్రతీ సారి రాజమౌళి సినిమా విడుదల డిలే అవుతూ ఉంటుంది. కారణం ఏదైనా ఈ సారి మాత్రం అలా జరగకూడదు అని, నిర్మాత ఆల్రెడీ ప్రకటించిన తేదీ కి సినిమా ని ఎలాగైనా విడుదల చేయాలి అనే పట్టుదల తో సినిమా చేస్తూ వెళ్తున్నారు చిత్ర యూనిట్.

సినిమా విడుదల అయ్యాక రాజమౌళి తో జత కట్టాలి అని ఇటు తెలుగు, తమిళ, కన్నడ అటు హిందీ హీరోలు నిర్మాతలు రెడీ గా ఉన్నారు. కానీ ఈ సినిమా తరువాత మళ్ళి మరో సినిమా తప్పక వెతుక్కోవాల్సిన పరిస్థితి ఈ ఆర్ఆర్ఆర్ హీరోలది. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమా అయిన వెంటనే కొరటాల శివ తో జత కట్టాలని చూస్తున్నారు.

ఇప్పటికే ఒకసారి జనతా గారేజ్ సినిమా కి శివ తో పని చేసాడు తారక్. చరణ్ కూడా శివ తో పని చేయాల్సి ఉండి కుదరలేదు కాబట్టి ఈ సారి అవకాశం మిస్ చేసుకోవద్దు అని, తన తండ్రి తో శివ సినిమా అయిపోయిన వెంటనే తన సినిమా కోసం లాక్ చేసుకోవాలని చరణ్ భావిస్తున్నారట.

అయితే చివరికి ఆ శివుని దయ ఎవరి పై ఉంటుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -