Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రధాని మోడీని దుమ్ము దులిపిన హాట్ హీరోయిన్..!

- Advertisement -

ఇన్ని రోజులూ సెలబ్రిటీలు అంతా మోడీ ఫ్యాన్స్ గానే కనిపించారు. ప్రధానమంత్రి భజన చేస్తూ వార్తల్లోకి వచ్చారు. మోడీ సూపర్ అని.. ఆయన పాలన అదుర్స్ అని వారు చెప్పుకొంటూ వచ్చారు.

సాధారణంగా రాజకీయాల గురించి స్పందించడానికి ఇష్టపడని సినిమా వాళ్లు కూడా మోడీ విషయంలో స్పందించారు. మోడీ ని ట్విటర్ ద్వారా పొగడ్తల్లో ముంచెత్తారు. మోడీ ని కలిసి మరికొందరు అభినందల వర్షం కురిపించి వచ్చారు!

 

మరి ఇదంతా ఏడాది నుంచి జరుగుతున్న తతంగమే.. భారతీయ జనతా పార్టీ తరపున మోడీ  ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి కూడా అనేక మంది జై మోడీ అంటూ వచ్చారు. అయితే ఇప్పుడు తొలిసారి ఒక హీరోయిన్ మోడీపై పంచ్ వేసింది. ప్రదానిగా నరేంద్రమోడీ వ్యవహరణ తీరును ప్రశ్నించింది. మోడీ తీరును ఎండగట్టింది. చాలా ధైర్య సాహసాలతో ఆమె మోడీపై పవర్ ఫుల్ పంచ్ లు వేయడం విశేషం. ఇలా మోడీపై ధ్వజమెత్తిన హీరోయిన్ నేహా దూపియా! 

 

“ఒక్క వర్షానికే ముంబై నగరం స్తంభించిపోయింది. జనజీవనం ఇబ్బంది పడిపోయింది. పరిపాలన అంటే.. యోగా చేయడం.. సెల్ఫీలు తీసుకోవడం కాదు..” అంటూ నేహా దూపియా ట్వీట్ చేసింది. ఈ విధంగా నేహాదూపియా మోడీ పాలనపై ట్వీట్ చేసి సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో… ఆ హీరోయిన్ పై మోడీ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఆమె బూతు సినిమాల్లో నటించిందని.. ఆమెకు మోడీని విమర్శించే అర్హత లేదని వారు అంటున్నారు. మరి అలాంటి సినిమాల్లో నటిస్తే అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉండదా?! 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -