Friday, May 10, 2024
- Advertisement -

ఆ సినిమాను హిట్ చేయించే బాధ్యత పవన్ అభిమానులదేనా!

- Advertisement -

నితిన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో సినిమా రావడం ఖాయం అయ్యింది. ప్రస్తుతం నిర్మాతగా కొంచెం బిజీగా ఉన్న నితిన్ ఆ సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ తో సినిమాను ప్రారంభించే అవకాశాలున్నాయి.

పూరీతో చేయాల్సిన సినిమా ఆగిపోవడంతో ఈ సారి నితిన్ త్రివిక్రమ్ తో చేయబోతున్నాడు. ఇక ఈ మధ్య నే ‘సన్నాప్ సత్యమూర్తి’ తర్వాత ఖాళీగా ఉన్న త్రివిక్రమ్ నితిన్ తో సినిమా చేయబోతున్నాడు.

మరి ఎవరూ ఊహించని కాంబినేషన్ ఇది. తివిక్రమ్ ,నితిని కాంబోలోసినిమా రాబోతోందని ఎవరూ అనుకోలేదు. అయితే ఈ సినిమా ఇప్పుడు పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇలాంటి రేర్ కాంబోలో… సినిమా రావడానికి కారణం పవన్ కల్యాణ్ అని తెలుస్తోంది. అటు నితిన్, ఇటు త్రివిక్రమ్ ఇద్దరూ పవన్ కు సన్నిహితులే.. వీరిద్దరూ పవన్ ను దేవుడిగా చూసే వాళ్లే! 

ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరూ కలిసి  సినిమా చేస్తున్నారు. ఎవరితో సినిమాలు చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ఈ ఇద్దరినీ కలిపింది పవర్ స్టారేనని తెలుస్తోంది. మరి ఈ సినిమాను హిట్ చేయాల్సిన బాధ్యత పవన్ అభిమానుల మీద పడ్డట్టేనేమో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -