జయలలిత చనిపోయి రెండు మూడు రోజులు గడుస్తున్నా ఆమె వారసుడు , వారసురాలు గా ఎవరు ఆవతరిస్తారు అనే విషయం లో రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతోంది. తమిళనాట రజినీకాంత్ లాంటి క్రేజ్ నీ ఫాలోయింగ్ నీ సొంతం చేసుకున్న హీరోలలో విజయ్ – అజిత్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
వీరిద్దరిలో విజయ్ కి అమ్మతో పెద్ద చనువు లేదు కానీ అజిత్ అంటే మాత్రం జయలలిత కి వల్లమాలిన అభిమానం. పోయీస్ గార్డెన్ లో జయలలిత ఇంటికి అప్పాయింట్మెంట్ అనేదే లేకుండా వెళ్ళగలిగిన తక్కువ మంది మనుషులులలో అజిత్ కూడా ఒకడు అంటే వారిద్దర్ మధ్యనా ఎంత సాన్న్నిహిత్యం ఉంది అనేది అర్ధం చేసుకోవాలి. జయలలిత మృతి చెందిన సమాచారం తెలిసిన వెంటనే ఆయన తన షూటింగ్ ను రద్దు చేసుకుని హుటాహుటిన భారత్ బయలుదేరారు. నిన్న అర్ధరాత్రి చెన్నైకు చేరుకుని… ఎయిర్ పోర్టు నుంచి నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లి… తన భార్య షాలినితో కలిసి నివాళులర్పించాడు.
కాగా అజిత్ ను జయలలిత తన కుమారుడిలా భావించేదని… ఆయనంటే ఎంతో అనురాగం చూపించేదని చెబుతుంటారు. అంతేకాదు.. తన తదనంతరం పార్టీని నడిపించే బాధ్యత రాష్ట్రాన్ని పాలించే బాధ్యత అజిత్ తీసుకోవాలని కూడా ఆమె కోరుకునేదని.. అత్యంత సన్నిహితుల వద్ద ఆ కోరిక పలుమార్లు వ్యక్తంచేసిందని కూడా చెబుతారు. అజిత్ ను జయ తన వారసుడిగా ప్రకటించాలనుకుందని.. కానీ అంతలోనే అనారోగ్యం పాలవడంతో ఆ అవకాశం రాలేదని అంటునట్నారు. అమ్మ వారసత్వం అందుకున్న పన్నీర్ సెల్వం.. భవిష్యత్తులో జయ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తున్నశశికళ అజిత్ ను ఎంతవరకు ఆమోదిస్తారు.. ఒకవేళ అలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వస్తారా.. ఒకవేళ వస్తే వీరిని ఎదుర్కొనే సామర్థ్యం ఎలాంటి రాజకీయ అనుభవం లేని అజిత్ కు ఉందా.. అజిత్ కు రజనీకాంత్ వంటివారెవరైనా అండగా నిలిచే అవకాశాలున్నాయా వంటి అనేక చర్చలు ఇప్పుడు తమిళనాడు జరుగుతున్నాయి.