Saturday, May 4, 2024
- Advertisement -

అక్కడ దుమ్మురేపిన వలిమై

- Advertisement -

వరుస విజయాలతో తమిళ్ స్టార్ అజిత్ మంచి ఊపుమీద ఉన్నాడు. తాజాగా ఆయన నటించి వలిమై సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదలైంది. తమిళ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజే కలెక్షన్ల దుమ్ము దులిపింది. థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం కనిపించింది.

తొలి రోజున ఈ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ నుంచి 36.17 కోట్లను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. ఫస్టు డే వసూళ్ల విషయంలో అక్కడ రజనీ ‘2.0’ .. ‘అన్నాత్తే’కి మించి ఈ సినిమా వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే ఇక్కడ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకున్నట్లు కనిపించడం లేదు. తెలుగులో హీరోగా మంచి క్రేజ్ ఉన్న కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.

‘భీమ్లా నాయక్’ ఎఫెక్ట్ తమ సినిమాపై ఉంటుందని కార్తికేయ చెప్పినట్టుగానే జరిగింది.తమిళ టైటిల్ తోనే తెలుగులో రిలీజ్ చేయడం .. పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్ గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -