Saturday, May 4, 2024
- Advertisement -

నా రూటే స‌ప‌రేటు అంటున్న చైనీస్ మేక‌..దీని స్పెషాలిటి ఎంటో తెలుసా…?

- Advertisement -

సాధార‌నంగా మేకలు ఆకులు, గడ్డి తింటాయ్ అని కొట్టిపారేయకండి. ఇప్పుడు చెబుతున్న మేక అందుకు భిన్నం. ఎందుకంటే ఆగ్రాలో ఉన్న చైనీస్ మేక‌ను చూస్తే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఈ మేక వెరీ స్పెష‌ల్‌.

మ‌నుషులు కూల్‌డ్రింక్స్‌ను గ్యాప్ ఇచ్చి తాగుతుంటారు. కాని నా రూటే స‌ప‌రేటు అంటోంది ఈ చైనీస్ మేక‌. దీనికి కూల్ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం. బాటిల్ లో పోసి పెట్టేస్తే గ్యాప్ ఇవ్వకుండా గటగటా తాగేస్తోంది.థమ్స్ అప్ మాత్రమే కాదు కోకాకోలా, పెప్సీ లాంటి కూల్ డ్రింక్స్ ను చల్లగా లాగించేస్తోంది. దీంతో ఈ మేక బరువుకు సంవత్సరానికే 70 కేజీలకు చేరుకుంది.

ఇంతలా కూల్ డ్రింక్స్ తాగుతోంది…ఆహారం తీసుకోదా అనేగా మీ సందేహం. అక్క‌డికే వ‌స్తున్నా…కులు, అలములకు కొంచెం దూరంగా ఉండే ఈ మేక తాజా పళ్లు, డ్రై ఫ్రూట్లను ఆహారంగా తీసుకుంటోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఓ మీడియా చానెల్ ఇటీవల ప్రసారం చేయడంతో ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో ఉంటున్న ఈ మేక ఫేమస్ అయిపోయింది.

మేం కొంటాం అంటే మేం కొంటాం.. అంటూ పలువురు బక్రీద్ సందర్భంగా ఈ మేక కోసం పోటీపడ్డారు. అయితే యజమాని వసీమ్ మాత్రం తాను ఈ మేకను అమ్మబోని తేల్చిచెప్పాడు. ఈ మేకను చైనా నుంచి తెప్పించుకోలేదనీ, చిన్నచిన్న కళ్లు ఉండటంతో తానే ముద్దుగా ఈ మేకకు చైనీస్ అని పేరు పెట్టానని చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -