జగన్ అభిమానులకు శుభవార్తే.ఇన్నాల్లు జగన్‌పై ఉన్న ఈడే కేసు క్లోజ్ అయినట్టేనన్న వార్తలు టీడీపీ వర్గాల్లోనే బలంగా వినిపిస్తోంది.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి తోడ్పడిన అంశాల్లో జగన్‌పై ఉన్న అవినీతి కేసులు ఒకటి. ఇప్పడు ఆ కేసులే ఎత్తేసే పరిస్థితి వచ్చిందనే చర్చ మొదలయ్యింది.
అందుకే టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. ఈడీ కేసుల్లో జగన్ కి ఎందుకు ఉపశమనం దొరుకుతుంఇదే చర్చ టీడీపీ వర్గాల్లోనే ప్రచారం నడుస్తోంది. ఆ పార్టీ నేతలే ఇప్పుడు జగన్ కేసులు చుట్టూ చర్చ జరుపుతున్నారు.
{loadmodule mod_custom,GA1}
తాజాగా టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం ప్రకారం జగన్ కి బీజేపీలోని ఓ వర్గం బలంగా సహకరిస్తోంది. జగన్ ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ డీ కేసుల నుంచి రిలీఫ్ కి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం సహకరించే అవకాశం కనిపిస్తోంది.
గతంలో ప్రధాని మోదీని జగన్‌ను కలసినపుడు భాజాపా నాయకులు దానిని సమర్థించారు.అంటే జగన్ తన మీదున్న ఈడీ కేసులు తొలగించుకోవడానికి అన్ని రకాలుగాను అవకాశాలు మెరుగుపరుచుకున్నట్టే నన్న ప్రచారం జరుగుతోంది.
ఈడీ కేసుల నుంచి ఉపశమనం కోసం జగన్ ఫైన్ కట్టే అవకాశం ఉందని సమచారం. అందుకు తగ్గట్టుగా కేసుల్లో మార్పులు సాగించే అవకాశం ఉంది. జగన్ కేసుల్లో ఉన్న కంపెనీల తరుపున ఈడీకి ఫైన్ కట్టడానికి సిద్ధమయినట్టు కూడా చెబుతున్నారు. అది పూర్తయితే ఇక కేసుల తొలగించడం ఖాయం. అయితే ఫైన్ కడితే తప్పు అంగీకరించినట్టే అనే భావన రాకుండా కంపెనీల తరుపున కట్టడం ఒకటి, ఫైన్ కట్టిన తర్వాత ఈడీ వేధింపులంటూ కోర్టుకెళ్ళే ఆలోచన కూడా చేస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
{loadmodule mod_custom,GA2}
అయితే ప్రస్తుతానికి కేసుల నుంచి రిలీఫ్ దక్కడం అత్యవసరం కాబట్టి అవసరమైతే కండీషన్స్ కి అంగీకరించే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. ఇదంతా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం శ్రేణులకు మింగుడుపడని ఈ అంశాన్ని కేంద్రం, జగన్ కుమ్మక్కయ్యారన్న కోణంలో ప్రచారం మొదలెట్టేశారు. ఇది నిజంగా జరిగితే ఫలితం ఏంటన్నది వేచిచూడాల్సిందే.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమెరికా అమ్మాయి
- పార్టీ నాయకుల గురించి జగన్కునివేదిక ఇచ్చిన ప్రశాంత్ కిషోర్..
- అరుదైన ఘనత సాధించిన జగన్ కూతురు.. అదేంటో తెలుసా..?
- త్వరలోనే ఆక్రమాస్తుకేసులనుండి నిర్దోషిగా బయటకు వస్తాడా….?
{youtube}CGBlwCm9SLY{/youtube}