Sunday, May 4, 2025
- Advertisement -

అబ్బాయిది అమరావతా? అయితే ఓకే!!

- Advertisement -

అవును. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో.. పెళ్లీడుకొచ్చిన అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

తల్లిదండ్రులు ఇప్పుడు ఇదే మాట అనుకుంటున్నారట. కాస్త మంచి సంబంధం.. అంతో ఇంతో సొంత భూమి ఉండి.. అబ్బాయి మామూలుగా చదువుకున్నవాడైనా పర్వాలేదు.. అమెరికా సంబంధాలు అవసరం లేదు.. అమరావతి వాడైతే చాలు అని మార్పు చూపిస్తున్నారు.

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి ఒక్కసారికి బూమ్ వచ్చేసరికి.. అక్కడ ఎకరం భూమి సొంతంగా ఉన్నా చాలు.. మన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేద్దాం అని అమ్మాయి తల్లిదండ్రులు ఆశపడుతున్నారట. ఉన్న ఊళ్లోనే… కళ్ల ముందు.. కన్న బిడ్డ ఆనందంగా ఉంటే చాలు కదా.. అనవసరంగా విదేశాలకు పంపి లేనిపోని కంగారును మనసులో పెట్టుకోవడం ఎందుకు అని సంబంధాలు వెతుకుతున్నారట.

ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేస్తున్నాయి. ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఫ్యూచర్ లో ప్రపంచ పటంలో అమరావతిని పెడతామని సీఎం బాబు ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. చూస్తుంటే.. మంచి విద్యాసంస్థలు కూడా వచ్చేస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో హాస్పిటళ్లూ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇంతలా సౌకర్యాలు మన ముందుంటే.. బయటి బంగారం కోసం ఆరటం ఎందుకు అని ఆంధ్రా ప్రజలు ఆలోచిస్తున్నారట.

ఆఖరికి.. పెళ్లిళ్ల బ్యూరో వాళ్లనూ అమరావతి ప్రభావం వెంబడిస్తున్నట్టు తెలుస్తోంది. అబ్బాయి వాళ్లది అమరావతండీ.. మంచి కుటుంబం.. అంటూ అమ్మాయి వాళ్లను బుట్టలో వేసుకునే ప్రయత్నాలు కూడా పెళ్లిళ్ల బ్యూరోలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భూముల ధరలు పెరగడమే కాదు.. సంబంధాల్లో కూడా ఇంతలా ప్రభావం చూపిస్తుండడంతో.. ఒక్కసారిగా అమరావతి వార్తల్లోకి ఎక్కింది.

Related

  1. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?
  2. రేప్ చేయించుకున్నట్టు నటించి డబ్బులు లాగుతున్న అమ్మాయి .. – జగత్ కిలాడీ ఇది
  3. ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతారో తెలుసా?
  4. అమ్మాయిలను ఆకర్షించాలంటే ఇలా చేయండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -