Friday, May 10, 2024
- Advertisement -

అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

- Advertisement -

ఇటివలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ప్రేమలో పడ్డట్లు అక్కినేని యంగ్ హీరో అఖిల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొంత కాలంగా ఇండస్ట్రీ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గుసగుసలు కాస్తా ఎక్కవై ఎంగేజ్మెంట్ కూడా అయ్యిపోయిందంటూ ప్రచారం మొదలవ్వడంతో ఈ విషయంపై అఖిల్ స్పందించారు.

“అవును.. నిజమే నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, కానీ ఎంగేజ్ మెంట్ మాత్రం కాలేదు, ఆ అమ్మాయిని మా ఫ్యామిలీకి పరిచయం చేసాను” అని చెప్పేశారు అక్కినేని అఖిల్. మరి ఇంతకి ఎవరు ఆ అమ్మాయి? అని ప్రశ్నిస్తే.. ఆమె పేరు, ఇతర వివరాలు ఇప్పుడే చెప్పను అని తప్పించుకున్నాడు. అయితే ఇలాంటి విషయాలు ఎంత దాచినా బయటకు మాత్రం ఏదో రకంగా లీక్ అవుతునే ఉంటాయి. తాజా గా అఖిల్ విషయంలో కూడా అలాగే జరిగినట్లు తెలుస్తోంది. అఖిల్ సన్నిహిత వర్గాల్లో వినపడుతున్న టాక్ ప్రకారం అఖిల్ గర్ల్ ఫ్రెండ్ పేరు, ఆమె ఫ్యామిలీ సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

అఖిల్ లవ్ చేస్తున్న అమ్మాయి పేరు శ్రీయ భూపాల్ అని తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ శాలిని భూపాల్ కూతురు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మాయి అమెరికా న్యూయార్కులో డిజైనింగ్ కోర్సు చేసిందట. నాగ్ కు ఆ అమ్మాయి ఫ్యామిలీ కి మంచి స్నేహం ఉందట. నాగచైతన్య పెళ్లి సెట్ అయ్యాక ఈ విషయన్ని చెప్పాలి అనుకున్నాడట అఖిల్ కానీ ఈ లోపే లీక్ అయ్యింది. ఇక చైతూ, సమంత లవ్ విషయంపై కూడా ఇంకా అఫీషియల్ గా ఎలాంటి న్యూస్ రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -