Monday, May 5, 2025
- Advertisement -

విశ్వాసం చూసిన శున‌కం….

- Advertisement -
Amazing incident in Warangal

పుట్టిన‌వాడు గిట్ట‌క‌మాన‌దు….గిట్టిన వాడు పుట్ట‌కు మాన‌దు భ‌గ‌వ‌ద్గ‌త‌లో శ్రీకృష్ణుడు చెప్పిన స‌త్యం.చావు అనేది ఎప్పుడు ఎక్క‌డ‌నుండి ఎలా వ‌స్తుందో ర‌హ‌స్య‌మే.మ‌నిషి చావాల‌నుకున్న‌ప్పుడు చావు రాదు…వ‌స్తె దాన్ని ఎవ్వ‌రూ ఆప‌లేరు.

వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఓ అవ్వ విష‌యంలో మొద‌టిదే రుజువ‌య్యింది.చావాల‌ని ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేదు. విధి విచిత్రం.
అస‌లు విష‌యానికి వ‌స్తే వ‌రంగ‌ల్ జిల్లాలోని నల్లబెల్లి మండలం బోల్లోనిపల్లెకుచెందిన గండు సుగుణమ్మ(65) భర్త కొమ్మయ్య రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లై వెళ్లిపోగా ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఒంటరితనంతోపాటు అనారోగ్యం బాధించడంతో విరక్తి చెందిన సుగుణమ్మ.. ఆత్మహత్య చేసుకోవాలనుకుని శుక్రవారం రాత్రి గ్రామంలోని వ్యవసాయ బావిలో దూకింది.

{loadmodule mod_custom,GA1}

విచిత్రం ఏమిటంటె రెండ్రోజుల క్రితమే ఒక నాగుపాము పడి పైకి రాలేక అక్కడక్కడే తిరుగుతోంది. గ్రామానికే చెందిన చెందిన సాదమల్లయ్య పెంపుడు కుక్క కూడా శుక్రవారం మధ్యాహ్నం అదే బావిలో పడిపోయింది.సుగుణమ్మ దూకేటప్పటికే ఆ రెండూ అక్కడ ఉన్నాయి. గాయాలతో కదల్లేని స్థితిలో సుగుణమ్మ.. పాము, కుక్కతోపాటు బావిలోనే రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపి, తెల్లవారిన తర్వాత సాయం కోసం కేకలు పెట్టింది.దీంతో స్థానికుల ఆమెను ర‌క్షించారు.
సుగుణమ్మ అరుపులకు రెచ్చిపోయిన నాగు భయంకరంగా పడగవిప్పి బుసలు కొడుతూ ఆమెను కాటేసేందుకు రెండుసార్లు ప్రయత్నించింది. కానీ.. అక్కడే ఉన్న శునకం సినీఫక్కీలో ఆమె రక్షణకు ముందుకొచ్చింది. బుసలు కొడుతున్న పామును నోటితో పట్టి దూరంగా విసిరేసింది. కుక్క‌ పాము కాటుకు గురైనా.. సుగుణమ్మకు రక్షణగా ఎటూ కదలకుండా అక్కడే నిలబడింది.

{loadmodule mod_custom,GA2}

మంచానికి నాలుగు వైపులా తాళ్లు కట్టి దాన్ని బావిలోకి దించి ఆమెను పైకి తీసుకొచ్చారు.అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తాళ్ల సాయంతో కుక్కను పైకి లాగి వైద్యంచేశారు. వృద్ధురాలిని పాము నుంచి రక్షించిన ఆ శునకం హీరోగా మారింది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}y7Nz34yiR5Y{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -