Sunday, May 5, 2024
- Advertisement -

విశ్వాసం అంటే ఇదే..! యజమాని కోసం అంబులెన్స్​ వెంట కుక్క పరుగు..!

- Advertisement -

శునకం ఎంతో విశ్వాసమైన జంతువు అన్న విషయం తెలిసిందే. తమ యజమానులు ఎక్కడికి వెళితే అక్కడికి ఇవి పరుగెత్తుతూ ఉంటాయి. ఇక ఇంటిని నిత్యం కాపాడుతూ ఉంటాయి. కొందరు కుక్కలను తమ కుటుంబసభ్యులుగా చూసుకుంటూ ఉంటారు. వాటికి తమతో పాటే భోజనం పెడతారు. ఇక కుక్కలు మరణిస్తే.. వాటికి దహనసంస్కారాలు చేసిన వాళ్లు.. సమాధులు కట్టిన వాళ్లు కూడా ఉన్నారు.

తాజాగా ఓ కుక్క తన యజమాని పట్ల ఎంతో విశ్వాసం చూపించింది. యజమాని అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. తన ఇంటి నుంచి యజమానిని అంబులెన్స్​లో తీసుకెళ్లారు. అయితే ఆ అంబులెన్స్​ వెంబడి కుక్క పరుగులు పెట్టింది. చివరకు ఆస్పత్రి డోర్ బయట యజమాని కోసం వేచి చూస్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ గా మారింది.టర్కీలో జరిగింది ఈ ఘటన.

Also Read: లైవ్​లో ‘గజరాజు’ మూవీ చూసినట్టుంది? వీడియో వైరల్

ఇస్తాంబుల్​లో చెందిన ఓ మహిళ ఇటీవల అనారోగ్యం పాలైంది. ఆమె ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దాన్ని ప్రాణంగా చూసుకుంటున్నారు. అయితే ఆ మహిళ కొంతకాలంగా ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.తాజాగా ఆమెకు పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను అంబులెన్స్​లో తీసుకెళ్లారు. అయితే ఆ అంబులెన్స్​ వెంబడే ఆ కుక్క పరుగులు తీసింది. చివరకు ఆస్పత్రికి కూడా చేరుకొని పడిగాపులు కాస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Also Read: కళ్లను మాయ చేసే వీడియో.. ఆకు సీతాకొక చిలుకై ఎగిరిపోయింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -