Thursday, May 16, 2024
- Advertisement -

గబ్బర్ సింగ్ ని చూస్తే చంద్రబాబు కి భయం – ఆనం వివాదాస్పద వ్యాఖ్య

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ ని చూస్తే చంద్రబాబు భయపడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసారు ఆనం వివేకానంద రెడ్డి,

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో న్యూస్ లో ఉండే ఆయన ఇప్పుడు ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఊహించని వ్యాఖ్యలు చేసారు. ” సర్దార్ గబ్బర్ సింగ్ చిటికేస్తే చాలు చంద్రబాబు భయపడిపోతున్నారు, అసలు ఆ భయం ఏంటి దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అనేవి ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఆయనకీ సర్దార్ గబ్బర్ సింగ్ అంటే అంత భయం ” అంటున్నారు  ఆయన.

ఈ కాంటెక్స్ట్ లో సర్దార్ గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గా అర్ధం చేసుకోవాల్సి ఉంది అంతే కానీ పవన్ అని ప్రస్తావన వివేకా ఎక్కడా తీసుకురాలేదు మరి. అంత రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సర్దార్ కి ఎందుకు భయ పడుతున్నారు అనేది తనని తొలిచేస్తున్న ప్రశ్న అని చంద్రబాబు భయం వెనక కారణాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నారు వివేకా.

కాంగ్రెస్ లో తన కొనసాగింపు గురించి అడగగా కాంగ్రెస్ లోనే కొనసాగుతాను అని కాంగ్రెస్ పార్టీ ని ఫీనిక్స్ పక్షి తో పోల్చారు ఆయన. రాహుల్ గాంధీ కి ఎదురు వెళ్ళేంత మూర్ఖుడ్ని తాను కాదన్నారు 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -