Friday, May 17, 2024
- Advertisement -

వేధించిన అమ్మాయి కాళ్ళు పట్టుకోమన్న సుప్రీం కోర్టు

- Advertisement -

ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురి చేసి, ఐదేళ్ల శిక్షకు గురైన యువకుడు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, న్యాయమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ యువతి కాళ్లపై పడి బతిమాలుకోవాలని, ఆమె క్షమిస్తేనే శిక్ష తగ్గే వీలుంటుందని అన్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, పదేళ్ల క్రితం హైదరాబాద్ లోని గాంధీనగర్ పీఎస్ పరిధిలో ఉన్న భాగ్యలక్ష్మీ నగర్ చెందిన ఓ అమ్మాయిని, అదే ప్రాంతంలో ఉండే మైనర్ యువకుడు ప్రేమ పేరిట వేధించాడు. వారి తల్లిదండ్రులు హెచ్చరించినా వినలేదు. 2005 జనవరి 30న తెల్లవారుఝామున అమ్మాయి ఇంటిలో చొరబడి మరోసారి వేధించాడు. బాధితురాలు తప్పించుకోవాలన్న క్రమంలో పెనుగులాడగా, కొద్దిపాటి గాయాలయ్యాయి. ఈ కేసులో నేరం రుజువు కావడంతో సెషన్స్ కోర్టు అతనికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించింది. 

కోర్టు తీర్పును ఆ యువకుడు హైకోర్టులో సవాలు చేయగా, తీర్పును సమర్థించిన న్యాయమూర్తి, శిక్షాకాలాన్ని మాత్రం రెండేళ్లకు తగ్గించారు. దీంతో అతను సుప్రీంకోర్టుకు అపీలు చేశాడు. ఇప్పటికే ఏడాదికి పైగా జైల్లో ఉన్నానని, శిక్షను ఏడాదికి తగ్గించాలని మొరపెట్టుకున్నాడు. కేసును విచారించిన జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ వి.గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం, ఇక జైలుకు పోకూడదంటే, ఆమె క్షమించాల్సి వుందని, యువతి కాళ్లపై పడి క్షమాపణలు కోరాలని సలహా ఇచ్చింది. మరో ఏడాది జైలు కావాలో, లేక శిక్ష తగ్గింపు కావాలో తేల్చుకునేందుకు అక్టోబర్ 6 వరకూ అతనికి గడువు కూడా ఇచ్చింది. ఈ లోగా ఆమె క్షమించినట్టు తమకు తెలిస్తే, జైలు శిక్ష తగ్గిస్తామని స్పష్టం చేసింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -