ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అనంతపురం రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొదటినుంచి జిల్లా రాజకీయాల్లో జేసీ సోదరులకు మంచి పట్టుంది. ఏ పార్టీలో చేరినా ఆధిపత్యం వారిదే. వారి ఆధిపత్య రాజకీయాలకు చెక్ పెట్టేందుకు కొత్త వ్యక్తి రంగంలోకి దిగారు. పోలీస్ శాఖలో 22 ఏళ్లుగా పని చేస్తున్న అనంతపురం జిల్లా కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కదిరి డీఎస్పీ లక్ష్మికి అందించినట్లు సమాచారం.
మాధవ్ విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితం ప్రభోదానంద ఆశ్రమ విషయంలో జేసీకీ, మాధవ్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. పోలీసులను హిజ్రాలతో పోల్చడంతో పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా మాధవ్ జేసీకీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మీసం తిప్పి మరీ సవాల్ విసిరి వార్తల్లో కెక్కిన సంగతి తెలిసిందే.
అయితే మాధవ్ వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పార్టీనేతలతో సంప్రదింపులు జిరిపినట్టు తెలుస్తోంది. హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకే.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది . మరి ఇందులో ఎంత నిజముందో క్లారిటీ రావాల్సింది.
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ
- వైసీపీ నేత కేతిరెడ్డికి హైకోర్టులో ఊరట
- అమరావతి కట్టేనా?..లేక మళ్ళీ మట్టేనా?
- కులగణన మేమే ఫస్ట్ చేశాం – జగన్
- గులాబీ సంరంభం…25 ఏళ్లు ఎన్నో మైలురాళ్లు!
- కేసీఆర్ ఆదేశాలు పాటించని మాజీ ఎమ్మెల్యే!