గోరంట్ల ” డర్టీ పిక్షర్ ” రాజకీయం ?

ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో చర్చనీయం అయిందో అందరికీ తెలిసిందే. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఉన్న ఆ వీడియోపై అటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఇటు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఒక ప్రజా ప్రతినిధి హోదాలో ఉన్న గోరంట్ల మాధవ్ ఇలా న్యూడ్ వీడియో ద్వారా ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంటని యావత్ ప్రజానీకం వైసీపీ సర్కార్ ను నిలదీసింది. అయితే ఇంత జరిగిన పార్టీ పరంగా వైఎస్ జగన్ ఎలాంటి చర్చలు తీసుకోకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే వీడియో వాస్తవమని తేలితే చర్యలు తప్పవని ఆ మద్య సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినప్పటికి.. గోరంట్ల విషయంలో కాస్త మౌనం పాటించారు వైఎస్ జగన్.

అయితే ద్వారా వైరల్ అవుతున్న వీడియో నిజమైనది కాదని, అది ఎడిటింగ్ వీడియో అని తమా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలిందని అనంతపురం ఎస్పీ చెప్పుకొచ్చారు. అయితే తమ పార్టీ నేత చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎస్పీ తో ఆవిధంగా వైసీపీ సర్కార్ చెప్పించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. అయితే ఎస్పీ చూపించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ పై సామాన్యుడికి కూడా కొన్ని అనుమానాలు రాక మానవు. ఆ రిపోర్ట్ ఏ సంస్థ ఇచ్చిందనేది ఎస్పీ తెలపకపోవడం గమనార్హం. అంతే కాకుండా వైరల్ అవుతున్న వీడియో మాత్రమే ఫెక్ అని చెప్పిన ఎస్పీ ఒరిజినల్ గురించి ప్రస్తావించలేదు.

దీన్ని బట్టి చూస్తే గోరంట్ల విషయంలో దాటవేసే దొరణిలో వైఎస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇది వీడియోపై టీడీపీ చేయించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ మళ్ళీ వేడిని రాజేస్తోంది. అమెరికన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ వీడియో ఒరిజినలే నంటూ రిపోర్ట్ ఇచ్చిందని టీడీపీ నేత పట్టబి రామ్ తెలిపారు. ఆ వీడియోలో ఎలాంటి మార్ఫింగ్, ఎడిటింగ్ జరగలేదని, నివేదికలో ఫోరెన్సిక్ సంస్థ వెల్లడించిందని పట్టాబి రామ్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. మరి దీనిపై జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనప్పటికి ఒక ప్రజా ప్రతినిధి హోదాలో ఉన్న నేత అసభ్యకరంగా న్యూడ్ కాల్ మాట్లాడడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. కానీ వైఎస్ జగన్ మాత్రం తన పార్టీ ఎంపీ పై ఈ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం నిజంగా ఆశ్చర్యకరమే.

Related Articles

Most Populer

Recent Posts