అమ్మపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. ఇలా చేస్తున్నావేమిటి అమ్మా అంటూ వాపోతున్నారు. ఇంతకీ అమ్మ అంటే ఎవరనుకుంటున్నారా. ఇంకెవరు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.
ఇక నాయకులు, కార్యకర్తలకు ఆగ్రహం రావడానికి కారణం శాసనసభ ఎన్నికల్లో టిక్కట్ల కేటాయింపు. అన్నాడిఎంకె పార్టీని తుడిచిపెట్టేస్తానని అన్న వారికి, అసెంబ్లీ నుంచి జయలలితను బహిష్కరించాలంటూ ప్రకటనలు గుప్పించిన వారికి టిక్కట్లు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ జయలలితను విమర్శించిన వారిలో మనోహరన్ అనే వ్యక్తాకి తిరువూరు జిల్లా మడత్తుకుళం నియోజకవర్గం నుంచి టిక్కెట్ కేటాయించారు. ఆయనపై అనేక ఫిర్యాదులున్నాయి.
దీంతో పాటు గడచిన ఎన్నికల్లో పార్టీ లోక్ సభ అభ్యర్ధిని ఓడించేందుకు కూడా మనోహరన్ ప్రయత్నించారని పార్టీలో చర్చించుకుంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పిడిన వారికి ఎందుకు టిక్కట్టు కేటాయించారంటూ నాయకులు మండిపడుతున్నారు. అయినా వీళ్ల కోపమే కాని అమ్మ తలచుకుంటే వీళ్లెంత.. వీళ్ల కోపమెంతా…