Sunday, April 28, 2024
- Advertisement -

అన్నాడీఎంకేలో శశి ‘కలకలం’… చిన్నమ్మ పాచికలు పారతాయా?

- Advertisement -

జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే గాడి తప్పింది. శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకొని ముఖ్యమంత్రి కావాలని భావించారు. ఆమె లెక్కలు తప్పి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెను ఏకంగా పార్టీ నుంచే బయటకు పంపించారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు శశికళ జైలు నుంచి విడుదలైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందే ఆమె అనూహ్యంగా రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

ఆ తర్వాత ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయింది. అయితే అప్పటినుంచి శశికళ మళ్లీ వెలుగులోకి వచ్చారు. పలువురు అన్నాడీఎంకే నేతలతో ఫోన్​లో మాట్లాడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్పులు కూడా బయటకొచ్చాయి. ఆమె అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాత్రం ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి రానివ్వకూడదని చూస్తున్నారు.

ప్రస్తుతం అన్నాడీఎం సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఇందుకోసం ఆరునెలల గడువు కావాలని అన్నాడీఎంకే నేతలు ప్రధాన ఎన్నికల కమిషన్​కు ఉత్తరం రాసినట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ చేజారి పోతుందని.. శశికళ ఆధీనంలోకి వెళ్తుందని వారు భావిస్తున్నట్టు సమాచారం. అయితే అన్నాడీఎంకే కార్యకర్తలు, కింది స్థాయి నేతలు మాత్రం శశికళే రావాలని కోరుకుంటున్నారని సమాచారం.

సీఈసీ వద్ద గుర్తింపు పొందిన పార్టీలన్నీ ఐదేళ్లకు ఒకసారి తప్పనిసరిగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలనే నియమావళి ఉంది. అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల్లో భాగంగా కొత్త సభ్యత్వాల నమోదు, పునరుద్ధరణ, జిల్లాస్థాయి నుంచి పార్టీ ప్రధాన కార్యాలయ ఆఫీస్‌ బేరర్స్‌ ఎంపికను 2014 ఆగస్టు నుంచి 2015 ఏప్రిల్‌ వరకు నిర్వహించారు. 2014 ఆగస్టు 29వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏడోసారి ఎన్నికయ్యారు. మిగతా కార్యవర్గం కూడా సంప్రదాయం ప్రకారం ఎన్నుకున్నారు.

అయితే ఆ తరువాత అనేక కారణాల వల్ల సంస్థాగత ఎన్నికలు జరగలేదు. 2017 సెప్టెంబర్ లో జనరల్‌బాడీ సమావేశాన్ని మాత్రమే నిర్వహించి ప్రధాన కార్యదర్శికి బదులుగా సమన్వయకర్త (పన్నీర్‌సెల్వం) ఉప సమన్వయకర్త (ఎడపాడి పళనిస్వామి)ను ఎన్నుకున్నారు.ప్రస్తుతం శశికళ అన్నాడీఎంకే తన ఆధీనంలోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు పార్టీలోని కొంతమంది పరోక్షంగా సహకరిస్తున్నారు. అయితే పరిస్థితులు ఎలా మారతాయో వేచి చూడాలి.

Also Read : ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్​పై క్యాడర్​ నిరుత్సాహం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -