Monday, April 29, 2024
- Advertisement -

ఏపీ సీఎం జగన్ బాలయ్య అభిమానా?

- Advertisement -

నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా లో ఒక ఫోటో వైరల్ అవుతుంది. అది ఏదో పేపర్ లో వచ్చిన ఒక సినిమా కి సంబందించిన ప్రకటన. బాలకృష్ణ ప్రధాన పాత్ర లో నటించిన సమరసింహా రెడ్డి సినిమా విజయోత్సవం సందర్భం గా కడప జిల్లా బాలయ్య బాబు అభిమానులు సినిమా కి సంబందించిన విజయోత్సవం గురించి పత్రికలో ప్రచురించారు. అయితే పోస్టర్ కింద కడప జిల్లా బాలకృష్ణ అభిమానుల సంఘం ప్రెసిడెంట్ గా వైస్ జగన్ మోహన్ రెడ్డి పేరు, ఫోటో ఉన్నాయి. ఇది చూసిన వాళ్ళు అంతా నిజం గా జగన్ బాలయ్య బాబు అభిమాని ఆ, బాలకృష్ణ అంటే ఆ రేంజ్ లో అభిమానించేవాడా అనే డవుట్స్ ని వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఈ ఫోటో విషయం లో నిజమెంత అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటి అంటే ఆ పత్రిక ప్రకటన 1999 సంవత్సరం ది, కానీ అక్కడ వాడిన జగన్ ఫోటో మాత్రం 2003 లో దిగింది. దీని బట్టి చూస్తే ఎవడో బాలకృష్ణ అభిమాని కావాలని ఫోటోషాప్ లో ఇది సృష్టించారు అని తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బాలకృష్ణ అభిమాని అని డప్పు కొట్టుకోవడం కోసం ఇదంతా చేశారని తెలుస్తుంది. సో ఇది పూర్తి గా ఫేక్.

కాకపోతే కొంత మంది రాజకీయ నాయకులూ బాలకృష్ణ అంటే జగన్ కి అభిమానం అని మాత్రం పలు మార్లు చెప్పిన విషయం వాస్తవం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -