Sunday, May 4, 2025
- Advertisement -

సరిహద్దులో కాల్పులకు తెగబడ్డ పాక్.. భారత సైనికుడు మృతి!

- Advertisement -

ఓ వైపు స్నేహ హస్తాన్ని చాపుతూనే దొంగ దెబ్బ తీస్తూ వస్తుంది పాకిస్థాన్. గత కొంత కాలంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైన్యంపై దొంగ దెబ్బ తీస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమ్మూకాశ్మీరులోని రాజౌరి జిల్లా సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాన్ వీర మరణం చెందారు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ సైనికులు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు తెగబడ్డారు. 

ఈ కాల్పుల్లో భారత సైనికుడు లక్ష్మణ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సిపాయ్ లక్ష్మణ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే వీరమరణం చెందారు.  పాక్​ బలగాల కాల్పుల్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు నలుగురు సైనికులు బలయ్యారు.

కాగా, పాక్​ చర్యను.. భారత బలగాలు దీటుగా తిప్పికొడుతున్నాయని సైన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది. పాక్ సైనికుల కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు. పాక్ సైనికులు సరిహద్దుల్లో తరచూ కాల్పులు జరుపుతుండటం వల్ల పౌరులతోపాటు పశువులు మరణిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -