సినీ నటి ఆర్తీ అగర్వాల్ కన్నుమూశారు. అమెరికా న్యూజెర్సీలో గుండె పోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది.
‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి పలు అగ్రహీరోలు అందరితోనూ నటించి మంచి నటిగా గుర్తింపు పొందారు. లైపోసక్షన్ చికిత్స చేయించుకున్న ఆర్తీ అగర్వాల్ శ్వాస సంబంధిత ఇబ్బందులతో ప్రాణం విడిచినట్లు తెలుస్తోంది.
2001లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆర్తీ అగర్వాల్ తక్కువ కాలంలోనే అగ్రహీరోయిన్‌ల జాబితాలో చేరారు.
ఆర్తీ అగర్వాల్ 2005 లో ఆత్మహత్యకు ప్రయత్నించారు. 2007లో గుజరాతీ ప్రవాస భారతీయుడితో వివాహం చేసుకున్న ఆర్తీ వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.
Watch here: http://adyanews.com/index.php/videos?slg=aarthi-agarwal-is-no-more&orderby=latest